Site icon Prime9

Standup Comedian Raju Srivastava: ప్రముఖ హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ ఇక లేరు

comedian srivastava passes away

comedian srivastava passes away

Standup Comedian Raju Srivastava: ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ (58) ఇక లేరు. స్టాండ్ అప్ కామెడీలో ఒక వెలుగువెలిగిన శ్రీవాస్తవ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా అనారోగ్య కారణాలతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీవాస్తవ ఈ రోజు కన్నుమూశారు.

శ్రీవాస్తవ అటు చలనచిత్రాల్లోనే కాకుండా ఇటు ప్రదర్శనలు సైతం ఇస్తూ ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. 1980 నుంచి రాజు శ్రీవాస్తవ వినోద పరిశ్రమకు నిర్విరామ కృషి చేశారు. కాగా అతను ఆగస్టు 10వ తేదీన జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా.. ఛాతిలో నొప్పి వచ్చి అక్కడికక్కడే కుప్పకూలారు. దానితో శ్రీవాస్తవను వారి కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించారు.

గత 40 రోజులు ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీవాస్తవ.. ఇవాళ కన్నుమూశారు. శ్రీవాస్తవ మృతి వార్తను ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. శ్రీవాస్తవకు చికిత్స అందించిన వైద్యులు ఆయనను బ్రతికించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ ఆఖరికి విఫలం అయ్యాయి. అభిమానులు సైతం శ్రీవాస్తవను ఆరోగ్యంగా తిరిగి రావాలాని ఆకాంక్షించారు. కానీ అందరిని విడిచి తిరిగి రాని లోకాలకు పయనమయ్యారు శ్రీవాస్తవ. చికిత్స సమయంలో శ్రీవాస్తవ మెదడుకి ఆక్సిజన్ అందలేదని దాని ఫలితంగా ఆయన స్పృహలోకి రాలేదని వైద్యులు వెల్లడించారు.

2005లో జరిగిన ‘ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’మొదటి సీజన్‌లో పాల్గొన్న తర్వాత శ్రీవాస్తవకు మంచి గుర్తింపు లభించింది. రాజు శ్రీవాస్తవ స్టాండ్-అప్ కామెడీ షోలు చేస్తూ నిరంతం ప్రేక్షకులకు అలరిస్తూ ఉండేవారు. రాజు శ్రీవాస్తవ ‘మైనే ప్యార్ కియా’, ‘ఆమ్దానీ ఆఠాణి.. ఖర్చ రూపాయా’, ‘మై ప్రేమ్ కి దీవానీ హూన్’ వంటి అనేక చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకుల హృదయంలో చెరగని ముద్ర వేశారు.

శ్రీవాస్తవ మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు, సినీ పరిశ్రమల పెద్దలు నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: Fire Accident: పేపర్ ప్లేట్ల పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం… ముగ్గురు సజీవ దహనం

Exit mobile version