Site icon Prime9

Schools Re open: సెలవులు అయిపోయాయ్.. రేపటి నుంచి విద్యాసంస్థలు ప్రారంభం

diwali holiday announcement by telangana

diwali holiday announcement by telangana

Schools Re open: తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు ముగిశాయి. రేపటి నుంచి స్కూళ్లు కాలేజీలు యథావిధిగా పునః ప్రారంభం కానున్నాయి. 2022 దసరా సెలవులు నేటితో ముగిశాయి. రేపటి నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులకు సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్ 6 శుక్రవారం వరకు 10 రోజుల పాటు దసరా సెలవులను ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. కాగా రెండో శనివారం ఆదివారం నేపథ్యంలో ఎక్కువశాతం పిల్లలు స్కూళ్లకు డుమ్మా కొట్టే అవకాశం ఉంది దానితో అక్టోబర్ 10సోమవారం నుంచి పూర్తిస్థాయిలో పారశాలలు పునః ప్రారంభం కానున్నాయి.

మరోవైపు తెలంగాణలో అక్టోబర్ 10 సోమవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో ప్రధాన పండుగలైన బతుకమ్మ, దసరా  నేపథ్యంలో అన్ని పాఠశాలలకు రాష్ట్ర ప్ర‌భుత్వం సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్‌ 9 వరకు 15 రోజుల పాటు సెలవులు ప్రకటించించిన విష‌యం తెలిసిందే. ఇక అక్టోబర్‌ 10వ తేదీన అన్ని విద్యాసంస్థలు తిరిగి పునఃప్రారంభం కానున్నాయి.

ఇదీ చదవండి: ఆ ఊర్లల్లో సూర్యుడే ఉదయించడు తెలుసా..!

Exit mobile version