NIA Raids: లీగల్‌ అవేర్‌నెస్‌ ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాలు… ఎన్ఐఏ సోదాలు

తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. పీఎఫ్‌ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) కేసులో ఎన్‌ఐఏ తమ దర్యాప్తును వేగవంతం చేసింది. నిజామాబాద్, నిర్మల్‌, కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో దాడులు చేపట్టింది.

NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. పీఎఫ్‌ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) కేసులో ఎన్‌ఐఏ తమ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో అరెస్ట్‌ అయిన వారి ఇళ్లతో పాటు అనుమానితుల గృహాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్, నిర్మల్‌, కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేపట్టింది.

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, నిర్మల్‌ జిల్లాల్లో 23 బృందాలతో ఎన్‌ఐఏ తనిఖీలు నిర్వహించగా… కర్నూలు, కడప జిల్లాల్లో మరో 23 బృందాలు సోదాలు చేపడుతున్నాయి. గుంటూరు జిల్లాలో 2 బృందాలతో ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. ఇప్పటికే పీఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ షాదుల్లా సహా ఇమ్రాన్, అబ్దుల్‌ లను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం విధితమే. వీరిపై పోలీసులు దేశ ద్రోహం కేసులు నమోదు చేశారు.

కరాటే శిక్షణ, లీగల్‌ అవేర్‌నెస్‌ ముసుగులో పీఎఫ్‌ఐ కార్యకలాపాలు నిర్వహిస్తోందన్న సమాచారం మేరకు ఈ సోదాలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో మతకలహాలు సృష్టించేందుకు పీఎఫ్ఐ శిక్షణ ఇస్తున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది.
భైంసా అల్లర్లతో సంబంధాలపైనా ఎన్‌ఐఏ దర్యాప్తు చేపట్టింది.

ఇదీ చదవండి: CM KCR: విజయవాడకు సీఎం కేసీఆర్.. మరి జగన్ మనసులో ఏముందో..