Challa Bhageeratha Reddy: వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అస్వస్థతతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం నాడు ఆయన మరణించారు.
గత కొద్దిరోజులుగా కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న చల్లా భగీరథరెడ్డి ఇకలేరు. ఆదివారం తీవ్రమైన దగ్గుతో ఇబ్బందిపడుతూ నంద్యాల జిల్లా అవుకులోని తన స్వగృహం నుంచి కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. కాగా ఆయనకు రెండు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తూ వచ్చారు వైద్యులు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆఖరి ఆయన మనమధ్య లేరు. చల్లా ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలన్ని విఫలయత్నాలు మారాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచాడు. ఈ విషయాన్ని ఆయన కుటుంబీకులు ధృవీకరించారు.
అయితే గురువారం అవుకులో ఆయన స్వగ్రామంలో చల్లా అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి వారసుడిగా భగీరథరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు.
ఇదీ చదవండి: విద్యుత్ తీగలు తెగిపడి ఆరుగురు కూలీలు మృతి