Site icon Prime9

MLA-Rajasingh : ఎమ్మెల్యే రాజాసింగ్‌ కు 14 రోజుల రిమాండ్

MLA-Rajasingh

MLA-Rajasingh : గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కు నాంపల్లి 14వ అదనపు మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రాజాసింగ్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వివాదాస్పదంకావడంతో రాజాసింగ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో రాజాసింగ్‌కు ధర్మాసనం రిమాండ్ విధిస్తూ ఆదేశించింది. అనంతరం రాజాసింగ్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

మరోవైపు బీజేపీ హైకమాండ్ రాజాసింగ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో..సెప్టెంబర్ 2లోగా వివరణ ఇవ్వాలని రాజాసింగ్‌ను ఆదేశించింది. అంతేగాక బీజేఎల్పీ పోస్ట్ నుంచి రాజాసింగ్‌ను అధిష్టానం తప్పించింది.

Exit mobile version