Site icon Prime9

Jammu Kashmir: డీజీపీ దారుణ హత్య.. గొంతు కోసి ఆపై కాల్చి..!

dgp murder

dgp murder

Jammu Kashmir: జమ్మూకాశ్మీర్లో దారుణం జరిగింది. ఏకంగా డీజీపీనే దుండగులు దారుణంగా హత్య చేశారు. అంతటితో ఆగక అతని శవాన్ని ఇంట్లోనే తగలబెట్టే ప్రయత్నం చేశారు.

జమ్మూకాశ్మీర్లో జైళ్లశాఖ డీజీపీగా హేమంత్ కుమార్ లోహియా పనిచేస్తున్నారు. అయితే హేమంత్ కుమార్ సోమవారం నాడు తన ఇంట్లోనే అనుమానాస్పద రీతిలో హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి డీజీపీ హత్యపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

కాగా అదే సమయంలో హేమంత్ ఇంట్లో పని చేసే సహాయకుడు కనిపించకుండా పోవడంతో అతనిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్యకు పాల్పడింది ఆయన ఇంట్లో పని చేసే సహాయకుడేనని భావిస్తున్నారు. అయితే, ఈయన ఇపుడు కనిపించకుండా పోవడంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. 57 యేళ్ల లోహియా 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. కాగా ఈ ఏడాది ఆగస్టులోనే ఆయన జైళ్ల శాఖ డీజీపీగా నియమితులయ్యారు. అయితే ఆకస్మికంగా ఆయన సోమవారం ఉడాయివాలాలోని తన నివాసంలోనే హత్య చేయబడ్డాడు. దుండగులు ఆయనను గొంతు కోసం హత్య చేసి అంతటితో ఆగకుండా ఆయన శరీరాన్ని తగులబెట్టే ప్రతయత్నం చేసినట్టుగా డీజీపీ దిల్ బాగ్ సింగ్ తెలిపారు. నిందుతుడు పరారీలో ఉన్నాడని అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు.

ఇదీ చదవండి:  ఢిల్లీలో ఘోరం.. శివుడి ఆజ్ఞ అంటూ చిన్నారి హత్య

Exit mobile version