Site icon Prime9

IT Raids: ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దేవినేని అవినాశ్ ఇళ్లల్లో ఐటీ సోదాలు

it-raids-in-Gannavaram MLA vallabhaneni-vamsi-and-devineni-avinash-houses

it-raids-in-Gannavaram MLA vallabhaneni-vamsi-and-devineni-avinash-houses

IT Raids: తెలుగు రాష్ట్రాల్లో ఏక కాలంలో ఐటీ అధికారులు దాడులు చేపట్టడడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈరోజు తెల్లవారుజాము నుంచే రెండు రాష్ట్రాల్లోనూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో ఉన్న వంశీరామ్ బిల్డర్స్ కార్యాలయం, ఇళ్లల్లో ఒకే సమయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వంశీరామ్ బిల్డర్స్ చైర్మన్, డైరెక్టర్ జనార్ధన్‌రెడ్డి ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలిపి 36 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఏపీలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. వైసీపీ నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ యువనేత దేవినేని అవినాశ్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో వైసీపీ నేత దేవినేని అవినాష్‌కు చెందిన స్థలాన్ని డెవలప్‌మెంట్ కోసం వంశీరామ్ బిల్డర్స్ తీసుకుంది. ఒప్పందంలో భాగంగా జరిగిన లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన ఈ దాడులు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఐటీ అధికారులు ఒక్కసారిగా వీరి ఇళ్లకు చేరుకుని దాడులు జరుపడంతో వైకాపా నేతల్లో ఒకింత అలజడి వ్యక్తం అవుతోంది.

ఇదీ చదవండి: “సైకో పోవాలి సైకిల్ రావాలి”.. జగన్ పై పట్టాభి సంచలన వ్యాఖ్యలు

Exit mobile version