Site icon Prime9

Hyderabad: హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర.. పోలీసుల ఎంట్రీతో..!

police constable cutoff marks reduced

police constable cutoff marks reduced

Hyderabad: హైదరాబాద్‌లో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలే టార్గెట్‌గా పేలుళ్లకు కుట్ర పన్నిన జాహిద్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు ఉగ్రవాద గ్రూపులతో జాహిద్‌కు లింకులు వున్నట్లుగా సమాచారం.

ఆర్ఎస్ఎస్ , బీజేపీ నేతలే లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు జాహిద్ అనే వ్యక్తి కుట్రపన్నాడు. ఉగ్రవాద కార్యకలాపాల కోసం యువకులను రిక్రూట్‌మెంట్ చేసుకుంటుంటాడు ఈ వ్యక్తి కాగా ఇప్పటికే ఆరుగురు యువకులను ఇతను రిక్రూట్‌ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సమాచారం మేరకు జాహిద్‌ను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు టెర్రర్ గ్రూపులతో జాహిద్‌కు లింకులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మక్కా మసీదు పేలుళ్ల కేసులోనూ జాహిద్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: అంధకారంలో పుదుచ్చేరి.. సీఎం సహా గవర్నర్ తమిళిసై ఇళ్లకు పవర్ కట్

Exit mobile version