Site icon Prime9

Actress Rambha: హీరోయిన్ రంభకు గాయాలు.. కారుకు యాక్సిడెంట్‌

Heroine Rambha car accident

Heroine Rambha car accident

Actress Rambha: ఒకప్పటి టాలీవుడ్ హాట్ హీరోయిన్ రంభ కారు రోడ్డుప్రమాదానికి గురైయ్యింది. ఈ ప్రమాదంలో ఆమెకు మరియు ఆమె కుటుంబీకులకు గాయాలయ్యాయని ఇన్ స్టా వేదికగా రంభ పేర్కొనింది.

అలనాటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రంభ వివాహానంతరం ఇప్పుడు ఫ్యామిలీతో హాయిగా జీవించేస్తోంది. తన భర్త, పిల్లలను చూసుకుంటూ చక్కగా లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఇలాంటి తరుణంలోనే రంభకు, ఆమె ఫ్యామిలీకి ప్రమాదం జరిగింది. కారు ప్రమాదంలో రంభ ఫ్యామిలీకి గాయాలయ్యాయి. స్కూల్ నుంచి తన పిల్లలను పికప్ చేసుకుని వస్తుండగా.. ఇంకో కారు తమ కారును ఢీ కొట్టిందని, అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంతో తన ఫ్యామిలీ అందరికీ గాయాలయ్యాయని రంభ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే అవన్నీ చిన్న గాయాలేనని, కానీ తన కూతురు సాషా మాత్రం ఇంకా హాస్పిటల్ బెడ్డు మీదే ఉందని ఇన్ స్టా వేదికగా చెబుతూ ఆమె ఎమోషనల్ అయ్యింది. తను త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థించండి. మాకు ఈ రోజు టైం ఏం బాగాలేదు. బ్యాడ్ టైం బ్యాడ్ డేస్. ఈ సమయంలో మీ ప్రార్థనలు మాకెంతో ముఖ్యమైనవి అంటూ రంభ వేడుకుంది.

ఈ మేరకు రంభ చేసిన పోస్ట్ మీద పలువురు కోలీవుడ్ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. రంభ ఫ్యామిలీకి భరోసా ఇస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఓరి దేవుడా.. జాగ్రత్తగా ఉండుమా.. మీ కోసం నేను ప్రార్థిస్తాను అని స్నేహ చెప్పుకొచ్చింది. మిమ్మల్ని పెద్ద ప్రమాదం నుంచి తప్పించి, సురక్షితంగా కాపాడినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలంటూ పాయల్ రాజ్ పుత్, శ్రీదేవి విజయ్ కుమార్, రాధిక శరత్ కుమార్ వంటి పలువురు సెలబ్రిటీలు పోస్ట్ ద్వారా రంభకు ధైర్యం చెప్పారు.

ఇదీ చదవండి: “హరోం హర” అంటూ పలకరించనున్న సుధీర్ బాబు

Exit mobile version