Site icon Prime9

Fire Accident: పేపర్ ప్లేట్ల పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం… ముగ్గురు సజీవ దహనం

Chittoor fir accident 3 persons killed

Chittoor fir accident 3 persons killed

Fire Accident: చిత్తూరులో విషాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగి.. ముగ్గురు వ్యక్తులు సజీవదహనం అయ్యారు.

చిత్తూరులోని రంగాచారి వీధిలో బుధ‌వారం తెల్లవారుజామున ఓ పేపర్ ప్లేట్ల తయారీ సంస్థ‌లో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘోర అగ్నిప్రమాదంలో తండ్రీ కొడుకులు సహా మరో వ్యక్తి సజీవ దహనం అయ్యారు. భాస్కర్ అనే వ్యక్తి తన రెండంతస్తుల భవనంలో గ్రౌండ్‌ఫ్లోర్‌లో పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్ నిర్వహిస్తూ ఆ బిల్డింగ్లోనే రెండో అంతస్తులో వారు నివాసం ఉంటున్నారు. కాగా వారు రాత్రి గాఢ నిద్రలో ఉండగా పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్లో భారీ మంటలు చెలరేగాయి.

కొద్ది క్షణాల్లోనే ఆ మంటలు రెండో అంతస్తుకు వ్యాపించడంతో.. నిద్రలేచి చూసిన వారికి తప్పించుకునే మార్గం లేకుండాపోయింది. అప్పటికే భవనాన్ని మంటలు చుట్టుముట్టాయి. భాస్కర్, ఆయన కుమారుడు ఢిల్లీబాబు (35), కుమారుడి స్నేహితుడు బాలాజీ (25) సజీవ దహనం అయ్యారు. మంటలు చూసి అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఫైర సిబ్బంది మంటలను అదుపు చేశారు. తలుపులు బద్దలుగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా ముగ్గురూ అపస్మారక స్థితిలో ఉన్నారు. వారిని ఆసుపత్రికి తరలించగమా అప్పటికే ప్రాణాలు పోయాయని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: Khammam Crime: లిఫ్ట్ ఇచ్చిన పాపానికి… ఎక్కించుకున్న వ్యక్తినే చంపేశాడు

Exit mobile version