Site icon Prime9

Kantara: కాంతారకు ఊరట.. వరాహరూపం సాంగ్ ఈజ్ బ్యాక్

court-clearance-to-varaharoopam-song-in-kantara-movie

court-clearance-to-varaharoopam-song-in-kantara-movie

Kantara: రిషబ్ శెట్టి నటించి తెరకెక్కించిన కాంతారా మూవీకి దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ సినిమా రికార్డులను సైతం బద్దలు కొట్టి టాప్ 1 సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. కాగా ఇటీవల నవంబర్ 24 నుంచి కాంతార సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం విధితమే. అయితే సినిమా క్లైమాక్స్ లో వచ్చే వరాహరూపం మ్యూజిక్ ని కోర్ట్ నిషేధించిన కారణంగా దానిని తీసేసి ఓటీటీలోకి రిలీజ్ చేశారు చిత్ర బృందం. దీనిపై ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

కొన్ని రోజుల క్రితం వరాహరూపం పాటకి వాడిన మ్యూజిక్ మాది అంటూ ఓ మలయాళ ప్రైవేట్ మ్యూజిక్ బ్యాండ్ కోర్టులో కేసు వేయడంతో ఆ మ్యూజిక్ ని వాడొద్దంటూ కోర్టు అప్పటికి నిషేధం విధించి విచారణని వాయిదా వేసింది. దీంతో ఆ మ్యూజిక్ తీసేసి సినిమాని రిలీజ్ చేశారు. సినిమాకి వరాహరూపం మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. అలాంటిది ఆ మ్యూజిక్ తీసేయడంతో అందరూ వరాహరూపం మ్యూజిక్ కావాలంటూ సోషల్ మీడియా వేదికగా కోరారు. ఈ కేసు విచారణకి రాగా కోర్టు ఈ సారి వరాహరూపం మ్యూజిక్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కాంతార సినిమాకి సపోర్ట్ గా తీర్పునిచ్చింది. దానితో ఆ మ్యూజిక్ పై నిషేధం ఎత్తివేయడంతో త్వరలో ఆ మ్యూజిక్ తో మరోమారు కాంతార ఓటీటీలోకి రానుంది. దీనిపై సినీలవర్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: నేషనల్ క్రష్ అధికారికంగా నిషేధించబడిందా?

Exit mobile version