Site icon Prime9

Chandrababu: జగన్ ఓ రాక్షసుడు.. అయ్యన్న అరెస్ట్ పై చంద్రబాబు ట్వీట్

chandrababu naidu tweet

chandrababu naidu tweet

Chandrababu: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒక సీఎంలా కాకుండా రాక్షసుడిలా వ్యవహరిస్తున్నాడని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యుడు, బీసీ నేత అయిన అయ్యన్నపాత్రుడి అరెస్ట్ విషయంలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గోడలు దూకి, తలుపులు పగల గొట్టి మరీ సీఐడీ అధికారులు నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడిని అరెస్టు చెయ్యడం దిగ్బ్రాంతి కలిగించిందని తెలిపారు. అధికారంలో వచ్చిన నాటి నుంచి అయ్యన్న కుటుంబాన్ని వైసీపీ ప్రభుత్వం వెంటాడుతోందని, ఇప్పటికే 10కిపైగా కేసులు ఆయనపై పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు. చింతకాయల విజయ్ పై కేసు విషయంలో సిఐడి విధానాలను కోర్టు తప్పు పట్టినా పోలీసులు తీరు మారలేదన్నారు. దొంగల్లా పోలీసులు ఇళ్లమీద పడి అరెస్టులు చేసిన పరిస్థితులు రాష్ట్రంలో ఎప్పుడైనా ఉన్నాయా? వైసిపి సాగిస్తున్న ఉత్తరాంధ్ర దోపిడీ పై ప్రశ్నిస్తున్న బిసి నేతల గళాన్ని అణిచివేసేందుకే అయ్యన్న అరెస్టు అని ఆయన అన్నారు. ప్రభుత్వ దోపిడీపై అయ్యన్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే ఈ అక్రమ అరెస్టులుని ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్

Exit mobile version