Site icon Prime9

Kodali Nani: చంద్రబాబే పవన్ హత్యకు కుట్ర చేశాడు.. కొడాలి నాని సంచలన ఆరోపణలు

kodali-nani falls ill and-admitted-in-apollo-hospital hyderabad

kodali-nani falls ill and-admitted-in-apollo-hospital hyderabad

Kodali Nani: ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు మరింత వేడి పెరిగిందని చెప్పవచ్చు. ఓ వైపు అయ్యన్న అరెస్ట్ మరోవైపు జనసేన నేత పవన్ పై హత్యాయత్నం చేస్తున్నారంటూ తెదేపా నేతలు మరియు జనసైనికులు అధికార వైసీపీపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు సైతం ఈ విషయాలపై తీవ్రస్థాయిలో మండిపడుతూ జగన్ రెడ్డి ఓ రాక్షసుడంటూ ట్వీట్ చేశారు. ఇక వీటన్నింటిపై వైసీపీ నేత కొడాలి నాని స్పందించారు. చంద్రబాబుపై మాటల తూటాలు ఎక్కుపెట్టారు. పవన్ కి ఏమైనా జరిగితే దానికి చంద్రబాబే కారణమవుతాడంటూ ఆరోపణలు చేశారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హత్యకు కొంత మంది కుట్ర చేస్తున్నారంటూ అనుమానం వ్యక్తం చేస్తూ జనసైనికులు ఇటీవల కాలంలో పోలీసులను కూడా ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలే దీనికి కారణమంటూ వారు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద రెక్కీ పై మాజీ మంత్రి కోడలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 45 సీట్లు అడుగుతున్నాడు కాబట్టి చంద్రబాబే అతన్ని చంపాలని చూస్తాడంటూ కొడాలి ఆరోపించారు. పవన్ చుట్టూ ఎల్లవేళలా చంద్రబాబు కోటరీ ఉందని, పవన్ కళ్యాణ్ ను ముంచిన, తేల్చిన, బతికున్న, చంపిన ఏం చేసినా దానికి బాధ్యుడు చంద్రబాబే అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో వాళ్ల మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు తన ప్రయోజనం కోసం ఏమైనా చేస్తాడని కొడాలి వ్యాఖ్యానించాడు. మరి ఈ కామెంట్లపై తెదేపా నేతలు ఏవిధంగా స్పందిస్తారో ఈ రాజకీయ రచ్చ ఏ మలుపు తిరగనుందో వేచి చూడాలి.

ఇదీ చదవండి: ఫాంహౌజ్ ముఖ్యమంత్రి పాత ముచ్చటనే పదే పదే చెప్పారు.. కిషన్ రెడ్డి

Exit mobile version