Site icon Prime9

MLA mandadi Satyanarayana: మాజీ ఎమ్మెల్యే మందాడి మృతి

hanamkonda-former-mla-mandadi-satyanarayana-died

hanamkonda-former-mla-mandadi-satyanarayana-died

MLA Mandadi Satyanarayana: తెలంగాణ బీజేపీలో విషాదం చోటుచేసుకుంది. హనుమకొండ మాజీ ఎమ్మెల్యే, భాజపా నేత మందాడి సత్యనారాయణ రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం హనుమకొండలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.

ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 2004 ఎన్నికల్లో మందాడి శ్రీనివాస్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ తరఫున హనుమకొండ నుంచి పోటీచేసి గెలుపొందారు. అనంతరం 2009లో టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఆయన బాధ్యతలు చేపట్టారు. మందాడి సత్యనారయణ మృతి పట్ల బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తదితరులు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

ఇదీ చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. విద్యాశాఖలో 134 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

 

Exit mobile version