Site icon Prime9

Cyber Crime: న్యూడ్ వీడియోలతో బెదిరిస్తోంది సార్.. యువతిపై యువకుడి ఫిర్యాదు..!

cyber crime

cyber crime

Cyber Crime: సైబర్ నేరగాళ్లు ఎలా చెలరేగిపోతున్నారో చెప్పడానికి ఇదో ఉదాహరణ. కేవలం నాలుగు రోజుల్లోనే ఓ యువకుడి ఆ మాయలేడి నట్టేటా ముంచేసింది. మొదట తియ్యని మాటలతో యువకుడికి వలవేసింది. ఆపై మాటలు కాస్త వీడియోకాల్స్ దాకా వెళ్లాయి ఆపై మరికాస్త సృతిమించి యువకుడి చేత దుస్తులు విప్పించి న్యూడ్ వీడియో కాల్ చేయించింది ఆ యువతి..ఇంక అంతే ఆ వీడియోతో ఆ యువకుడి కొంప కొల్లేరయ్యింది. న్యూడ్ వీడియో కాల్స్ ను రికార్డ్ చేసి వాటిని చూపించి డబ్బుల కోసం బెదిరించసాగింది. ఆమె వేధింపులు తట్టుకోలేని యువకుడు చివరికి పోలీసుల వద్ద మొరపెట్టుకున్నాడు. ఈ ఘటన విశ్వనగరమైన హైదరాబాద్లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి చెందిన యువకుడు ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల అతడికి ఇన్‌స్టా ద్వారా ఓ యువతి పరిచయం అయ్యింది. అదికాస్త క్రమంగా పెరిగి ఇద్దరి మధ్య చనువు ఏర్పండి. యువకుడు ఆ యువతి మైకంలో మునిగిపోయాడు. సీన్ కట్ చేస్తే ఇంకేముంది ఆమె యువకుడిపై తన ప్లాన్స్ అమలు చేయడం మొదలుపెట్టింది.మొదట్లో విపరీతంగా వీడియోకాల్స్ మాట్లాడేది ఆ తర్వాత దుస్తులు విప్పేసి వీడియో కాల్స్ మాట్లాడేది క్రమంగా ఆ అబ్బాయిని కూడా అలానే మాట్లాడమని ఫోర్స్ చేసింది. మనోడు ఊరుకుంటాడా.. అమ్మాయే అలా మాట్లాడగా లేనిది నాకేం తక్కువ అనుకున్నాడో ఏమో.. ఆమె అడిగిందే తడవుగా దుస్తులు విప్పేసి చాలాసేపు కాల్స్ మాట్లాడాడు. ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్నఆ మాయలేడి ఆ వీడియోను మొత్తం రికార్డ్ చేసింది.

తన చేతికి ఆ యువకుడి నగ్న వీడియోలు చిక్కడంతో ఆమె తన అసలు రూపాన్ని బయటపెట్టింది. వీడియోలను అతడికి పంపి డబ్బులు ఇవ్వమంటూ బెదిరింపులు ప్రారంభించింది. డబ్బు ఇవ్వకుంటే ఆ న్యూడ్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించింది. రూ. 5 వేలు, రూ. 10 వేలు పంపాలని మెసేజ్‌లు పెట్టేది. భయపడిపోయిన ఆ వ్యక్తి ఒకటి రెండు సార్లు డబ్బు పంపాడు. ఈ వేధింపులు మరీ పెరిగిపోవడంతో విసిగిపోయిన యువకుడు గురువారం గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: Hijab: ఇరాన్‌లో హిజాబ్ పై మిన్నంటిన నిరసనలు.. 31 మంది మృతి

Exit mobile version