Site icon Prime9

Hyderabad: హైదరాబాద్ ప్రజలకు అలెర్ట్.. ఆ ప్రాంతంలో 3 నెలలు ట్రాఫిక్ ఆంక్షలు

Hyderabad new traffic rules

Hyderabad new traffic rules

Hyderabad: హైదరాబాద్ ప్రజలకు అలర్ట్. బేగంపేట పరిధిలోని రసూల్‌పురా-రాంగోపాల్‌పేట మధ్య నాలా పునరుద్ధరణ పనుల జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేటి నుంచి మూడు నెలలపాటు ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్టు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. బుధవారం నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 21వ తేదీ వరకు ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.

రసూల్‌పురా నుంచి కిమ్స్ ఆసుపత్రి, మినిస్టర్ రోడ్, రాణిగంజ్, నల్లగుట్ట వైపు వెళ్లే వాహనాలు సీటీవో ఫ్లై ఓవర్ వరకు వెళ్లి యూటర్న్ తీసుకోవాల్సి ఉంటుంది.
రాణిగంజ్, నల్లగుట్ట, పీవీఎన్ఆర్ మార్గ్ నుంచి వచ్చే వాహనాలను రసూల్‌పురా వైపు అనుమతించరు. అటువైపు వచ్చే వాహనాలు ఫుడ్‌వరల్డ్, హనుమాన్ టెంపుల్ మీదుగా రసూల్‌పురా వైపు రావొచ్చు. సికింద్రాబాద్ నుంచి కిమ్స్ వైపు వెళ్లే వాహనాలు హనుమాన్ టెంపుల్ నుంచి ఎడమవైపు టర్న్ తీసుకుని ఫుడ్‌వరల్డ్ మీదుగా కిమ్స్ వైపు దారి మళ్లింపులు ఉంటాయి. లేదంటే సీటీవో ఫ్లై ఓవర్ నుంచి ఎడమవైపు టర్న్ తీసుకుని రాణిగంజ్ మీదుగా కిమ్స్ వైపు వెళ్లొచ్చు. అంబులెన్సులు కిమ్స్‌కు వెళ్లేందుకు బేగంపేట ఫ్లై ఓవర్ పైనుంచి సీటీవో ఫ్లై ఓవర్ వరకు వెళ్లి యూటర్న్ తీసుకుని కిమ్స్‌కు వెళ్లాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: కుటుంబాన్ని మొత్తాన్ని నరికిచంపిన కొడుకు

Exit mobile version