Site icon Prime9

Insecticide: ఆ మందు అమ్మకం, వినియోగంపై నిషేధం

sharp insecticide bans by ts govt

sharp insecticide bans by ts govt

Insecticide: సాధారణంగా రైతులు తక్కువ కాలంలో ఎక్కువ పంట దిగుబడి కోసమో లేదా పంటను క్రిమికీటకాల నుంచి కాపాడుకోవడానికి అనేక రకాల మందులు పిచికారీ చేస్తుంటారు. అయితే ఆ పురుగుమందులు బాగా పనిచేసి ఒక్కోసారి పంట దిగుబడి ఎక్కువగా ఇస్తాయి అదే ఆ మందు తగిన మోతాదులో లేకపోతే ఆరుగాలం కష్టించి పండించిన పంట నేలపాలవ్వక తప్పదు. ఇలాంటి ఓ పురుగు మందునే తాజాగా వ్యవసాయశాఖ నిషేధించింది.

పంటలపై తెగుళ్ల నియంత్రణకు రైతులు పిచికారీ చేసే ‘షార్ప్‌’(బ్యాచ్‌-ఎస్‌0264) రసాయనిక పురుగుమందుపై తెలంగాణ వ్యవసాయశాఖ నిషేధం విధించింది. ఆ మందు నాసిరకం అని తేలడంతో అమ్మకాలు, వినియోగంపై ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఇన్‌సెక్టిసైడ్‌(ఇండియా) లిమిటెడ్‌’ అనే కంపెనీ ‘అసిటమిట్రిడ్‌ 20 శాతం ఎస్‌పీ’ అనే రసాయనంతో దీనిని తయారుచేసి షార్ప్‌ అనే పేరుతో మార్కెట్‌లో అమ్మకాలు జరుపుతోంది. తాజాగా దీని నమూనాలను సేకరించి ప్రయోగశాలలో పరీక్షించగా ఆ మందు చాలా నాసిరకంగా ఉన్నట్టు తేలిందని వ్యవసాయ శాఖ వివరించింది. రైతులు ఈ మందును కొనుగోలు చెయ్యవద్దని మార్కెట్లో ఎవరైనా ఈ మందును అమ్మకాలు జరిపితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని వ్యవసాయ శాఖ హెచ్చరించింది.

ఇదీ చదవండి: నేడు భాగ్యనగరంలోని ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Exit mobile version