Site icon Prime9

Vamshika: వైరల్ అవుతన్న బ్రేకప్ ఏడుపు వీడియో.. వాడి కోసం ఎంత కష్టపడ్డానో తెలుసా అంటూ ఏడుస్తున్న గర్ల్ ఫ్రెండ్..!

vanshika breakup post story crying session goes viral

vanshika breakup post story crying session goes viral

Viral News: ఇటీవల కాలంలో యువతకు ప్రేమలు సహజం. అయితే కొంత మంది ప్రేమలు పెళ్లికి దారితీసి సుఖంగా సంతోషంగా సాగుతుంటాయి.. మరికొన్ని ప్రేమలు బ్రేకప్ లకు దారి తీస్తుంటాయి. అయితే ఈ లవ్ జర్నీ అనేది కొన్ని సంవత్సరాలే కావచ్చు లేదా కొన్ని నెలలు, రోజులే ఉండవచ్చు. ఈ జర్నీలోని ప్రతి చిన్న విషయాన్ని గుర్తించి మధుర జ్ఞాపకంగా తలచుకునేవారూ ఉంటారు.. వాటిని పెద్దగా పట్టించుకోని వారూ ఉంటారు. ఇక్కడే మొదలవుతుంది అసలు సమస్య ప్రేమలో ఉన్నప్పుడు అమ్మాయిలు అబ్బాయిలకు.. అబ్బాయిలు అమ్మాయిలకు అందంగా కనిపించి తన లవర్ ను మెప్పించేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వాటిని గుర్తించకపోతే తెగ బాధపడుతుంటారు. అలా గుర్తించనందుకు బ్రేకప్స్ జరుగుతుంటాయి. అందులో భాగంగా వంశిక అనే అమ్మాయి తన రెండునెలల ప్రేమ బ్రేకప్ అయిన సందర్భంగా తన స్నేహితురాలితో ఏడుస్తూ బ్రేకప్ స్టోరీని పంచుకున్న సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. మరి ఆ బ్రేకప్ స్టోరీ ఏంటి అసలు ఎందుకు ఏమయ్యింది అనేది ఇప్పుడు చూసేద్దాం.

తమ రెండు నెలల వార్షికోత్సవం తర్వాత తన ప్రియుడు ఆకాష్ తనతో విడిపోయిన తర్వాత వంశిక ఎంత హృదయవిదారకంగా బాధపడుతుందో తన స్నేహితురాలితో వాయిస్ కాల్ ద్వారా పంచుకుంది. ఈ మొత్తం కాల్ ని మరొకరు వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశారు. దానితో ఇప్పుడు వంశిక బ్రేకప్ స్టోరీ కాస్త తెగ ట్రెండ్ అవుతుంది. తన లవ్ జర్నీలో జరిగిన రోజూ సన్నివేశాలను ఆమె కన్నీటి పర్యంతం అవుతూ తన ఫ్రెండ్తో చెప్పుకొచ్చింది. నేను అతన్ని ప్రాణంగా ప్రేమించాను తనకోసం ఎంతో చేశాను. ఆకాశ్ ను నేను ఊరికే వదిలెయ్యను అంటూ వంశిక ఏడుస్తూ చెప్పింది. దానికి ఆమె స్నేహితురాలు నువ్వేం ఏం చెప్తున్నావు? ఆకాష్ ఒక విచిత్రమైన వ్యక్తి అని సమాధానం ఇస్తుంది. నీకు తెలుసు కదా నాతో డేటింగ్ చేయడానికి అబ్బాయిలు కాలేజీ బయట క్యూలో నిలబడతారని కానీ నేను వారందరినీ తిరస్కరించి అతనితో డేటింగ్ చేశాను అని వంశిక చెప్తుంది. అవును నిన్ను మన కాలేజీలోని కుర్రాళ్లందరూ తెగ ఇష్టపడతారు అని చెప్పింది.

నేను అతని కోసం చాలా ఎంత కష్టపడ్డానో నీకు తెలుసా.. మా రెండు నెలల వార్షికోత్సవానికి అతని కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలని నేను అనుకున్నానుని. అతని ఎదుట బాగా కనిపించాలని ఖరీదైన హీల్స్, దుస్తులు కొన్నానని చెప్పుకొంచ్చింది. తను ఇలా చేస్తాడనుకోలేదని ఇదంతా తెలిస్తే మింత్రా సేల్ కోసం వెయిట్ చేసి ఆఫర్ లో కొనేదాన్నని అప్పుడు కాస్త డబ్బు ఆదా అయ్యేదని చెప్పుకొచ్చింది. అప్పుడు ఆమె స్నేహితురాలు, “అవును, రెండు నెలల వార్షికోత్సవం అనేది ఒక చిన్న ఒప్పందమేమి కాదు.” మరి ఆకాష్ నీ కోసం ఏమైనా చేశాడా అని అడుగుతుంది. దానికి వంశిక ఏమీ చేయలేదని ఏడుస్తూ సమాధానం ఇస్తుంది. దానికి ఊరుకో ఏడవకు అంటూ వంశికను తన స్నేహితురాలు ఓదారుస్తూ ఉంటుంది.

నీకు తెలుసా నేను అతనికి ఇష్టమైన పనులన్నింటిని అలవాటు చేసుకున్నా.. తనకి ఫుట్ బాల్ అంటే ఇష్టమని ఆట గురించి నాకు ఏమీ అర్థం కాకపోయినా నేను ఫుట్‌బాల్ చూడటం ప్రారంభించాను. అతని కోసం నెయిల్ ఎక్స్ టెక్షన్ చేయించుకున్నానని, అతనికి అందంగా కనిపించాలని తనకోసం శరీరమంతా వాక్సింగ్ చేయించుకున్నానని అప్పుడు కూడా ఇంత బాధ కలుగలేదని ఆమె తన స్నేహితురాలితో కన్నీటి పర్యంతమైంది. కానీ సడెన్ గా కేవలం రెండు నెలల్లోనే ఆకాశ్ నాకు బ్రేకప్ చెప్పడం చాలా బాధగా ఉందంటూ రోధించింది.

ఇక ఇదంతా ఇలా ఉంటే మాటల్లోనే తన స్నేహితురాలు మరో స్నేహితుడు ఒకరు నీ ఫోటో చూసి ఇష్టపడ్డారని తన నెంబర్ని షేర్ చేస్తాను ఒకసారి మాట్లాడు అనగానే సరే పంపించూ అని వంశిక చెప్పడం గమనార్హం. ఇలా తన బ్రేకప్ స్టోరీ కాస్త ఫన్నీగానూ ఉంది. ఈ వీడియోను నెట్ ఫ్లిక్స్ కూడా ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. ఈ బ్రేకప్ స్టోరీపై మీమ్స్ సైతం తెగ వైరల్ అవుతున్నాయి. దీనితో పలువురు నెటిజన్లు వంశిక బ్రేకప్ స్టోరీ వైరల్ అవుతున్న దానిపై తన స్పందనేంటనే అనేది చూడాలంటూ కామెంట్లు రాసుకొస్తున్నారు. మరి నిజంగానే తనకు తెలియకుండానే తన బ్రేకప్ స్టోరీ షేర్ చెయ్యడంపై వంశిక ఏవిధంగా స్పందింస్తుందంటారు.

ఇదీ చదవండి: ఆకాశంలో అద్భుత దృశ్యం.. అలలై ఎగసిన మేఘాలు..!

Exit mobile version
Skip to toolbar