ఉభయ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం విజయరాయిలో ఇదేం ఖర్మ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వం దిగిపోతేనే ఏపీ రాష్ట్రం బాగుపడుతుందని పేర్కొన్నారు. లండన్ బాబుని మరల లండన్ పంపిస్తాననంటూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.
ఒక్క ఛాన్స్ అంటూ జగన్ ప్రజల నెత్తి మీద భస్మాసుర హస్తం పెట్టారని విమర్శించారు. రాష్ట్రం అన్ని రకాలుగా దెబ్బతిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. ఎక్కడ చూసినా ప్రజలు ఇదేం ఖర్మ అనే పరిస్థితికి రాష్ట్రాన్ని వైసీపీ నేతలు తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Chandrababu: లండన్ బాబును మరల లండన్ పంపిస్తా- చంద్రబాబు

chandrababu comment on cm jagan in eluru idem kharma program