Site icon Prime9

Pawan Kalyan Comments: పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి.. దేశంలోనే రికార్డు నెలకొల్పాము.. పవన్ కళ్యాణ్

pawan kalyan

pawan kalyan

Pawan Kalyan Comments: పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి.. దేశంలోనే ఒక రికార్డు నెలకొల్పామని.. జనసేన అదినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రతినిధుల సభలో ఆయన మాట్లడారు. ఓటమిని అంగీకరించని నేతలు అసెంబ్లీలోకి రాలేరని.. తాను అన్నిటిని సమానంగా తీసుకునే వ్యక్తినని తెలిపారు. గతంలో మన నేతలను చాలా మంది ఇబ్బందులు పెట్టారని.. చట్ట పరంగా వారిపై చర్యలు చేపడదామని తెలిపారు.

జనసేన అనేది ఇప్పుడు ఒక కేస్ స్టడీ ..(Pawan Kalyan Comments)

వైసీపీ నేతలను శత్రువులుగా చూడకూడదని.. అసభ్య పదజాలంతో ఎవరినీ కించపరకూడదని హితవు పలికారు. ఏ పార్టీకి చెందిన మహిళా నేతలు అయినా కించ పరచవద్దని.. అలా కించపరిస్తే.. ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ప్రజా స్వామ్యానికి ఎవరూ విఘాతం కల్పించకూడదని.. అలా ఎవరు వ్వవహరించినా.. కఠినంగా ఉంటామని తెలిపారు. దేశంలో 100 శాతం స్ట్రైక్ రేట్‌ ఎవరికీ సాధ్యం కాలేదన్నారు. జనసేన అనేది ఇప్పుడు ఒక కేస్ స్టడీ అయిపోయిందని పవన్ పేర్కొన్నారు. ఓటమిని తీసుకోలేని నేతలు అసెంబ్లీకి రావడం లేదన్నారు. ఓటమిని కూడా తీసుకునే ధైర్యం కావాలన్నారు. గత ప్రభుత్వం పాలనలో అందరినీ ఇబ్బందులకు గురి చేసారని అన్నారు. మాట్లాడాలంటే భయపడే రోజులు ఉండేవని అన్నారు. సీఎంగా పనిచేసిన చంద్రబాబును కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేసారని తెలిపారు. ఐదు కోట్ల మంది ప్రజలకు జనసేన వెన్నదన్నుగా నిలబడిందని అన్నారు. పోటీ చేయని చోట కూడా జనసేన కార్యకర్తలు అండగా నిలబడ్డారని, వారికి చేతులెత్తి మొక్కుతున్నానని చెప్పారు.అండగా నిలబడిన కార్యకర్తలకు చేతులెత్తి మొక్కుతున్నాను. బాధ్యతలు మోసే ప్రతి వారికి అండగా ఉంటాను. నాకు ప్రధాని గుండెల్లో స్థానం ఉంది అది చాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Exit mobile version