Site icon Prime9

Ram Charan-Upasana: నాతో కలిసి నా బిడ్డకూ ఇది స్పెషల్ ఎక్స్ పీరియన్స్.. ఉపాసన ఎమోషనల్ ట్వీట్

Ramcharan-Upasana

Ramcharan-Upasana

Ram Charan-Upasana: ప్రపంచ స్థాయిలో ఇపుడు RRRపేరు మారు మోగిపోతోంది. ప్రతిష్ట గోల్డెన్ గోబ్ అవార్డుల్లో బెస్ఠ్ ఒరిజనల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ అవార్డు దక్కించుకోవడం ఈ సినిమా టీమ్ పై ప్రశంశల వర్షం కురుస్తోంది. లాస్ఏంజెల్స్ లో జరిగిన ఈ అవార్డుల ఫంక్షన్ కు ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి సతీ సమేతంగా వెళ్లారు. రెడ్ కార్పెట్ పై స్టైలిష్ లుక్స్ తో రామ్ చరణ్, భారతీయత ఉట్టిపడేలా ఉపాసన (Ram Charan-Upasana)జంట అదరగొట్టారు.

తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ లవబుల్ కపుల్స్ లో రామ్ చరణ్, ఉపాసన కూడా ఒకరు. పలు సందర్భాలలో ఈ జంట ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూనే ఉన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఉపాసన జంట త్వరలో తల్లిదండ్రలు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తతో మెగా ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి లో ఉన్నారు. ఇక ఇదే ఊపులో ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ప్రతి ప్రోగ్రామ్ లో కలిసి పాల్గొంటూ సందడి చేశారు చరణ్, ఉప్సీ జంట.

ఎమోషనల్ అయిన ఉపాసన

RRR సినిమాకు అవార్డు రావడంపై ఉపాసన ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘ గోల్డెన్ గోబ్ అవార్డుల ఫంక్షన్ లో పాల్గోనడం చాలా హ్యాపీ గా ఉంది. RRR టీమ్ తో కలిసి ఈ ప్రయాణంలో భాగం అయ్యేలా చేసిన రామ్ చరణ్, రాజమౌళి కి ధన్యవాదాలు. నాతో కలిసి నా బిడ్డ కూడా ఈ స్పెషల్ మూమెంట్ ను ఎక్స్ పీరియన్స్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇండియన్ సినిమా ఓ ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకోవడం చాతా గర్వంగా ఉంది’ అంటూ ఎమోషన్ పోస్ట్ చేశారు ఉపాసన. కాగా, ఈ పోస్ట్ పై మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ గా ఉన్నారు. రామ్ చరణ్, ఉపాసనల వివాహం 2012 జూన్ 14న హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది.

 

ఇవి కూడా చదవండి…

RRR : గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో సత్తా చాటిన ఆర్ఆర్ఆర్.. బెస్ట్ సాంగ్ గా “నాటు నాటు”

సైలెంట్‌గా ఉపాసన ఎంట్రీ.. భార్యను రాంచరణ్ ఎలా పరిచయం చేశాడో చూడండి..

మొగల్తూరు స్థలంపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version