Nagababu On Alliances: వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పొత్తులపై నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో జరుగుతున్న జనసేన పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన నాగబాబు.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ మేరకు కర్నూలులో జనసేన నేతలు.. వీర మహిళలతో నాగబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు.
పొత్తులు కుదిరిన తర్వాతే ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఈ మేరకు జనసేన (Janasena ) నేతలు, కార్యకర్తలతో నాగబాబు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ఒక పార్టీయేనా.. అరాచకం, దుర్మార్గం, దౌర్జన్యం కలిస్తే వైసీపీ అంటూ నాగబాబు మండిపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఎవరితో అనేది పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని ఆయన అన్నారు.
వీరమహిళలు, జన సైనికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకోవడానికే ఈ సమావేశం నిర్వహించినట్లు నాగబాబు తెలిపారు.
గ్రామ స్థాయి నుంచి జనసేనకు కార్యకర్తలు ఉన్నారని.. జనసేనకు పార్టీ కార్యకర్తలే బలమని అన్నారు.
గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఇంఛార్జీలను త్వరలోనే నియమించనున్నట్లు నాగబాబు తెలిపారు.
ఏపీలో వైసీపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా పవన్ పోరాటం చేస్తున్నారు. వైసీపీ వ్యతిరేక విపక్షాల్ని కూడగట్టే పనిలో పవన్ ఉన్నారు.
దీనిపై త్వరలో పవన్ ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
ఇప్పటికే టీడీపీతో కలిసి ప్రయాణం చేస్తామనే సంకేతాలు ఇచ్చిన పవన్.. ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశం కూడా జరిపారు.
ప్రస్తుతం భాజపాతో పవన్ పొత్తు పెట్టుకుంటారా.. లేదా అన్నది రాష్ట్రంలో ఉత్కంఠ రేపుతోంది.
రాష్ట్రంలో వైసీపీ పాలనే తమ లక్ష్యమని నాగబాబు అన్నారు.
ప్రతి జనసేన కార్యకర్త.. వైసీపీపై పోరాటం చేయాలని సూచన.
జన సేన కార్యకర్తలతో నాగబాబు వరుస సమావేశాలు.
కర్నూలులో నాగబాబుకి ఘన స్వాగతం లభించింది.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/