Site icon Prime9

Varahi : జనసేన ” వారాహి “కి గ్రీన్ సిగ్నల్… తెలంగాణలో రిజిస్ట్రేషన్ కి ఓకే !

telangana-government-green-signal-to-janasena-varahi-registration

telangana-government-green-signal-to-janasena-varahi-registration

Varahi : జనసేన అభిమానులకు గుడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ ప్రచార రధం వారాహి రిజిస్ట్రేషన్ కి తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా వారాహి గురించి వైకాపా – జనసేన మధ్య వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. రక్షణ రంగానికి మాత్రమే అనుమతి ఉన్న ఆలీవ్‌ కలర్‌ ఎన్నికల ప్రచార రథానికి ఎలా వాడతారంటోంది వైసీపీ ఆరోపిస్తుంది. అలానే ఇది చట్టానికి విరుద్దమంటూ మోటార్‌ వెహికిల్‌ యాక్ట్‌ కూడా కోట్‌ చేస్తోందని అంటున్నారు.

అయితే వాస్తవానికి కలర్ లకు కోడ్స్ ఉంటాయి. భారత ఆర్మీ సంస్థ ఉపయోగించే కలర్ కోడ్… అంటే ఆర్మీ కలర్ : 7B8165 కాగా ఇప్పుడు జనసేన అధినేత ఎన్నికల వాహనం వారాహి కలర్ కోడ్ :  445c44 అని తెలుస్తోంది. ఈ క్రమంలో వారాహి వాహనం రంగుపై ఎటువంటి అభ్యంతరం లేదంటూ తెలంగాణ రవాణా శాఖ స్పష్టం చేసింది.

అలానే ” వారాహి “వాహనానికి రవాణా శాఖ చట్టం ప్రకారంగా అన్ని నిబంధలు ఉన్నాయని… వారాహి వాహనం రంగు ఎమరాల్డ్ గ్రీన్ అని తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు స్పష్టం చేశారు. వాహనం బాడీ తయారీకి సంబంధించిన సర్టిఫికెట్ ను పరిశీలించామని… అన్ని నిబంధనలు ఉన్నాయిని వాహనం రిజిస్ట్రేషన్ కు చట్ట ప్రకారం ఎటువంటి అభ్యంతరాలు లేనందున రిజిస్ట్రేషన్ చేశామని వెల్లడించారు. కాగా వారాహి రిజిస్ట్రేషన్ నెంబర్ TS13EX 8384 గా  తెలిపారు. ఈ తరుణంలో వాహనం రిజిస్ట్రేషన్ పై వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. మరోవైపు జనసేన కార్యకర్తలు మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతూ ట్రెండింగ్ చేస్తున్నారు.

 

Exit mobile version