Site icon Prime9

Samantha: ఓపిక లేకపోయినా వచ్చాను.. కన్నీరు పెట్టుకున్న సమంత

samantha-gets-emotional-on-shakunthalam-trailer-release event

samantha-gets-emotional-on-shakunthalam-trailer-release event

Samantha: మయోసైటిస్ వ్యాధి కారణంగా చాలా కాలంగా మీడియాకు దూరంగా ఉన్న నటి సమంత బయట కూడా కనపడలేదు. తాజాగా సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న శాకుంతలం ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సమంత పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా ట్రైలర్‌ ఈవెంట్‌లో సమంత భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సినిమా దర్శకుడు గుణశేఖర్‌ మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఎమోషనల్‌ అయింది సామ్.

ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నా..

అనంతరం సమంత(Samantha) మాట్లాడుతూ.. “త్వరలో శాకుంతలం రిలీజ్ కాబోతోంది. ఈ క్షణం కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నా. ఈ సినిమా చూశాక నాపై మరింత అభిమానం పెరుగుతుంది. గుణశేఖర్ మీద గౌరవంతో ఈ రోజు ఎలాగైనా ఈ ఈవెంట్ కు రావాలనుకున్నాను. అందుకే ఓపిక లేకపోయినా బలం మొత్తాన్ని కూడబెట్టుకుని కార్యక్రమానికి వచ్చాను. గుణశేఖర్ ప్రాణం పెట్టి ఈ సినిమా తీశారు. మాకు సపోర్ట్ గా ఉన్న దిల్ రాజు ధన్యవాదాలు. ఈ సినిమాలో భాగం కావడం నా అదృష్టం” అని సామ్ తెలిపింది.

చాలా కాలం తర్వాత మీడియా ముందుకు

ఇక ఇటీవలే సామ్‌ మయోసైటిస్‌ అనే వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. కాగా ఇప్పడిప్పుడే సామ్‌ కోలుకుంటోంది. రెండు రోజుల క్రితం ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించిన సమంత అందరికి షాక్ ఇచ్చింది. సన్నగా అవ్వడం, ఫేస్ లో గ్లో తగ్గడంతో ఆమె లుక్ మారిపోయిందని అభిమానులు నిరాశ చెందారు. దాదాపు కొన్ని నెలల తర్వాత సమంత మీడియా ముందుకి రావడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

విజువల్ ట్రీట్ గా ట్రైలర్

కాగా, శాకుంతలం ట్రైలర్ ఆకట్టుకుంది. విజువల్ పరంగా మాత్రం ట్రైలర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. సమంత నటన.. డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. మణిశర్మ సంగీతం కట్టిపడేస్తుంది. మైథలాజికల్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించింది. దిల్‌రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. రుద్రమదేవి తర్వాత గుణశేఖర్‌ ఈ సినిమా కోసం దాదాపు ఏడేళ్ళ సమయం తీసుకున్నాడు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 17న పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కానుంది.

ఇవి కూడా చదవండి:

ఇక వాల్తేరు ’విరాట్‘ ను చూడండి.. కింగ్ కోహ్లి బ్యాక్ ఇన్ యాక్షన్

‘శాకుంతలం’ ట్రైలర్.. కళ్లు చెదిరే విజువల్ వండర్ లో సమంత

నన్ను కార్నర్ చేసే సీన్ ఎవరికీ లేదు.. కానీ నా సినిమా రెండు రోజులు వాయిదా వేసుకున్నాను.. దిల్ రాజు

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version