Site icon Prime9

Animal Movie Bookings : తెలుగులో యనిమల్ మూవీ టికెట్ బుకింగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ .. హౌస్ ఫుల్స్ పక్కా ..

ranbir kapoor animal-movie-ticket bookings create new records

ranbir kapoor animal-movie-ticket bookings create new records

Animal Movie Bookings : హిందీ సినిమాలకు తెలుగులో పెద్దగా ఆధారణ ఉండదు . మహా అయితే షారుక్ ఖాన్ లాంటి హీరో సినిమాలకు మాత్రమే మంచి ఓపెనింగ్స్ వస్తుంటాయి. అంతే తప్ప వారం రోజుల ముందుగానే బుకింగ్స్ ఓపెన్ చేసినా.. హౌజ్ ఫుల్స్ అయ్యేంత సత్తా మాత్రం బాలీవుడ్ సినిమాలకు మన దగ్గర లేదు.కానీ యానిమల్ మాత్రం లెక్కలు తిరగరాసేలా కనిపిస్తుంది. ఈ సినిమాకు వారం రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ చేసారు దర్శక నిర్మాతలు.దానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా చాలా మేజర్ సెంటర్స్‌లో బుకింగ్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి .

సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తుంది యానిమల్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చూసాక సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ వచ్చేసింది.అండర్ వరల్డ్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ తో ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు.పైగా అర్జున్ రెడ్డి తర్వాత ఆయన మరో సినిమా చేయలేదు. దాంతో యానిమల్‌పై అంచనాలు మామూలుగా లేవు. కచ్చితంగా ఈ సినిమా కూడా 500 కోట్ల క్లబ్‌లో చేరుతుందనే అంచనాలున్నాయి. తెలుగులోనూ దీనిపై ఆసక్తి పెరిగిపోతుంది. దానికి ప్రజెంట్ బుకింగ్స్ నిదర్శనం. స్టార్ హీరోల సినిమాల స్థాయిలో యానిమల్‌కు తెలుగులోనూ బుకింగ్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, వైజాగ్ లాంటి ప్రధాన నగరాల్లో ఈ సినిమా బుకింగ్స్ చాలా హై లో ఉన్నాయి.

రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ హవా ఇంకా పెరగడం ఖాయం. తెలుగు బెల్ట్‌లోనే యానిమల్ కచ్చితంగా 50 కోట్ల క్లబ్‌లో చేరుతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఒకవేళ టాక్ వర్కవుట్ అయి.. బొమ్మ బ్లాక్‌బస్టర్ అయితే అదేం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఎందుకంటే సందీప్ వంగా క్రేజ్ అలా ఉంది మరి. ఇక హిందీలో ఈ సినిమాపై ఉన్న అంచనాలు లెక్కేయడం కష్టమే. ఏడాది చివర్లో కచ్చితంగా ఇండస్ట్రీని షేక్ చేసే బ్లాక్‌బస్టర్ అవుతుందని, కచ్చితంగా బాక్సాఫీస్ దుమ్ము దులిపేసే సినిమా అవుతుందని ట్రేడ్ పండితులు బలంగా నమ్ముతున్నారు. మొత్తానికి చూడాలిక.. యానిమల్‌తో సందీప్ ఎలాంటి మాయ చేస్తాడో..?

 

Exit mobile version