Pawan Kalyan In Unstoppable 2 : ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ టాక్ షో కి నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ షో లో ఇప్పటికే చంద్రబాబు నాయుడు, ప్రభాస్, శర్వానంద్, అడవి శేష్, విశ్వక్ సేన్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ మేరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల బాలయ్య షో లో పాల్గొన్నారు.
పవన్ ఎపిసోడ్ ని రెండు పార్ట్ లుగా రిలీజ్ చేశారు.
ఇటీవలే రిలీజ్ అయిన ఫస్ట్ పార్ట్ రికార్డులన్నీటిని చెరిపేసి కొత్త రికార్డులను సృష్టించింది.
దీంతో అటు నందమూరి అభిమానులు.. ఇటు మెగా అభిమానులు రెండో ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూశారు.
పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ, ప్రస్తుత పరిస్థితులు వంటి అంశాల మీద ఈ ఎపిసోడ్ ఉందనున్నట్లు రిలీజ్ అయిన ప్రోమోలను చూస్తే తెలుస్తుంది.
ఈ తరుణంలోనే తాజాగా రిలీజ్ అయిన ఎపిసోడ్ కూడా అదిరిపోయిందని చెప్పాలి.
ఈ సంధర్భంగా మీ అన్నయ్య దగ్గరి నుంచి నేర్చుకున్నావ్ ? ఏం వద్దనుకున్నావ్ అని పవన్ ని బాలయ్య ప్రశ్నించారు. అందుకు పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో జవాబు ఇచ్చారు.
(Pawan Kalyan In Unstoppable 2)ఒళ్ళు దాచుకోకుండా కష్టపడాలి – పవన్ కళ్యాణ్
ఈ మేరకు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఒళ్లు దాచుకోకుండా కష్టపడేతత్వాన్ని అన్నయ్య చిరంజీవి నుంచి అలవరుచుకున్నానన్నారు. పాలిటిక్స్‌లో విమర్శను కచ్చితంగా స్వీకరించాలి. ఏ విమర్శనైనా భరించాలనే దాన్నీ ఆయన నుంచే నేర్చుకున్నా. సద్విమర్శ వల్ల మనలోని లోపాలేంటో తెలుసుకుని, సరిచేసుకునే అవకాశం ఉంటుంది అని పవన్ చెప్పారు. అదే విధంగా అన్నయ్య నుంచి తీసుకోనిది ఏదైనా ఉందంటే అది మొహమాటం. అభిమానం వేరు.. అది ఓటుగా మారడం వేరు. సినిమా రంగంలో ఎవరైనా ఎక్కువ మంది అభిమానుల్ని సంపాదించుకుని, ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే దాని వెనుక దశాబ్దాల కృషి ఉంటుంది.
సినీ పరిశ్రమలో పేరున్న వ్యక్తి రాజకీయ రంగంలోకి ప్రవేశించి, అంతటి నమ్మకం పొందాలంటే సమయం పడుతుంది. రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవు. తక్కువలో తక్కువ దశాబ్దన్నర తర్వాత మీరు అడిగితే నా సమాధానం వేరుగా ఉంటుంది. ప్రస్తుతానికి నేను నమ్మకాన్ని సంపాదించుకునే పరిస్థితిలోనే ఉన్నా అని తేల్చి చెప్పారు. అధికారమనేది సాధ్యమైనంత ఎక్కువ మందికి అండగా ఉండాలని.. మనల్ని ఇబ్బంది పెట్టే ప్రభుత్వాలు ఉండకూడదని నేను కోరుకుంటున్నానని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తమ హక్కుని సద్వినియోగం చేసుకోగలిగే సామర్థత కలిగి ఉండాలి. దాన్ని ఎవరైనా కాలరాసినా ఎదుర్కొనే శక్తి ఉండాలి. దానిలో భాగంగా నేను ముందుకెళ్తున్నా. ఆ క్రమంలో అధికారం వస్తుందో రాదో నాకు తెలియదు. నా పని నేను చేసుకుంటూ ముందుకెళ్లడమే అని సమాధానం చెప్పారు.
ఇక షో లో బాలయ్య తన ఎనర్జీ తో ఈ ఎపిసోడ్ ను అద్భుతంగా హోస్ట్ చేశారు. దానితో పాటు పవన్ – బాలయ్య మధ్య సరదా సంబాషణలు.. కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ తో పాటు.. పవర్ స్టార్ గురించి కొత్త కొత్త విషయాలు కూడా బయటికి రావడం ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/