Pawan Kalyan : టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్లోని చంద్రబాబు ఇంట్లో ఆయన సమావేశమయ్యారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలు, ప్రతిపక్ష సభలపై ఆంక్షలు..ప్రతిపక్ష నేతలపై కేసులు.. దాడులు వంటి అంశాలపై ఇరువురు చర్చించనున్నారు. తాజా రాజకీయ అంశాలు, ప్రభుత్వ నిరంకుశ విధానాలపై చర్చించే అవకాశం ఉంది.
ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్-1 పైనా తాజా భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో..పొత్తుపై ఇప్పుడే ప్రకటించాలా? కొంతకాలం వేచి చూడాలా?.. అనే అంశంపై కూడా చర్చించబోతున్నట్లు సమాచారం. ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక బలోపేతానికి ఐక్యకార్యచరణ ప్రకటించనున్నట్లు సమాచారం. అదే విధంగా ఈనెల 12న శ్రీకాకుళంలోని రణస్థలంలో జనసేన యువశక్తి సభ గురించి కూడా చర్చించనున్నారు. ఆ కార్యక్రమానికి పోలీసులు పలు ఆంక్షలు విధించి.. అడుగడునా అడ్డుపడుతున్నారు.
ఈ అంశంపై జనసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విపక్షాలను ప్రభుత్వం టార్గెట్ చేస్తోందంటూ టీడీపీ, జనసేన వైఎస్ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. కాగా, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడాలని ఇప్పటికే ఇద్దరు నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. గతేడాది ఆక్టోబర్ 18న విజయవాడలోని ఓ హోటల్‌లో ఇరువురు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. గతంలో పవన్ విశాఖ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అప్పుడు పవన్‌ను కలిసి చంద్రబాబు సంఘీభావం తెలిపారు. ఇప్పుడు కుప్పం పర్యటన తర్వాత చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వచ్చి చర్చలు జరపడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రస్తుతం చంద్రబాబు, పవన్ భేటీకి మరింత ప్రాధాన్యత ఏర్పడింది.
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/