Site icon Prime9

Viveka Murder Case : వివేకా హత్య కేసులో నేడు విచారణకు హాజరు కానున్న ఎంపీ అవినాష్ రెడ్డి..

mpo-avinash-reddy-going-to-attend-for-enquiry-about-ys-viveka-case

Viveka Murder Case : మాజీమంత్రి, సీఎం జగన్ బాబాయ్ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే.

ఈ  కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి నేడు సీబీఐ ముందు విచారణకు హాజరు కానున్నారు.

హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో  మధ్యాహ్నం 3 గంటలకు జరిగే విచారణకు హాజరు కానున్నారు.

ఈ మేరకు శక్రవారం నాడు పులివెందుల నుంచి హైదరాబాద్ కి అవినాష్ బయలుదేరి వెళ్లారు.

కాగా సీఆర్పీసీ 160 సెక్షన్‌ కింద అవినాష్‌కు సీబీఐ నోటీసు జారీ చేసింది.

2019 మార్చి 15న వివేకా హత్య జరిగినప్పటి నుంచి.. ప్రతిపక్షాల వేళ్లన్నీ ఎంపీతో పాటు ఆయన తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డి వైపే చూపిస్తున్నాయి.

2020 మార్చి 11న హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేపట్టి 248 మంది సాక్షులు, అనుమానితులను విచారించి.. వాంగ్మూలాలను రికార్డు చేసింది.

ఆ వాంగ్మూలాలు, సేకరించిన ఆధారాలతో ఇప్పుడు కీలకమైన అవినాష్‌రెడ్డి విచారణకు రంగం సిద్ధమైంది.

సుప్రీంకోర్టు ఆదేశాలతో వివేకా కేసు హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు బదిలీ అయినందున విచారణ ముమ్మరం చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థ భావిస్తోంది.

దర్యాప్తు అధికారి రాంసింగ్‌ పేరుతో ఈ నెల 24న ఎంపీకి నోటీసులు జారీ అయ్యాయి.

 

ఈ కేసులో నిజానిజాలు ఇంకా బయటపెట్టాలని కుటుంబ సభ్యులు, ప్రతిపక్ష పార్టీ నేతలు కోరుతున్నారు.

సీబీఐ అధికారులపై అధికార పార్టీ వైసీపీ ఒత్తిడి తెచ్చిందని అందుకే విచారణ ఆలస్యమవుతోందని కుటుంబ సభ్యులు కూడా ఆరోపించారు.

అందుకే విచారణను ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని సునీత కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తెలంగాణ నుంచే విచారణ కొనసాగించాలని కోర్టు తీర్పునిచ్చింది.

తెలంగాణలో తొలిదశ విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.

ఈనెల 24నే విచారణకు రావాలని అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులిచ్చింది.

ముందుగా నిర్ణయించుకున్న ప్రొగ్రామ్స్ రీత్యా… ఐదు రోజుల తర్వాత విచారణకు హాజరవుతానని, కేసు విషయంలో పూర్తిగా సహకరిస్తానని సీబీఐకి అవినాష్ రెడ్డి లేఖ రాశారు.

దీంతో… ఈనెల 25న సీబీఐ అధికారులు పులివెందులకు చేరుకుని ఈనెల 28న విచారణకు రావాలని మళ్లీ నోటీసు ఇచ్చారు.

 

కీలకంగా మారిన దస్తగిరి వాంగ్మూలం (Viveka Murder Case)..

వివేకా కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్‌ దస్తగిరి మెజిస్ట్రేట్‌ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, మనోహర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిల పేర్లు ప్రముఖంగా ప్రస్తావించారు.

వివేకాను హత్య చేస్తే శివశంకర్‌రెడ్డి రూ. 40 కోట్లు ఇస్తారంటూ ఎర్ర గంగిరెడ్డి తమకు చెప్పారని ఆయన తెలిపారు.

‘ఎవరూ భయపడవద్దని.. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి మనల్ని చూసుకుంటారంటూ’ గంగిరెడ్డి భరోసా ఇచ్చారని కూడా దస్తగిరి వెల్లడించినట్లు సీబీఐ ఛార్జిషీట్‌లో పొందుపరిచింది.

అలాగే దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అరెస్టు సందర్భంగా పులివెందుల కోర్టుకు వచ్చిన అవినాష్‌రెడ్డి.. తమ దర్యాప్తు అధికారి రాంసింగ్‌ను బెదిరించినట్లు సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది.

వివేకా కేసును రెండున్నరేళ్లకు పైగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఇన్నాళ్లకు ఎంపీని విచారణకు పిలిచిన నేపథ్యంలో ఈ కేసు ప్రాధాన్యం సంతరించుకుంది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version