Minister Roja: నారా లోకేష్ పై పర్యాటక శాఖ మంత్రి రోజా ఫైర్ అయ్యారు. తనను డైమండ్ రాణి అంటూ వ్యాఖ్యనించడం పై రోజా స్పందించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి తనదైన శైలిలో స్పందించారు. లోకేష్ అంకుల్ అంటూ మంత్రి విరుచుకు పడ్డారు.
రోజా ఘాటు విమర్శలు..
నారా లోకేష్ వ్యాఖ్యలపై మంత్రి రోజా తీవ్రంగా స్పందించారు. యువగళం ప్రారంభించిన పప్పునాయుడు.. ఈ రాష్ట్రానికి సీఎం గా చేసిన చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న..
లోకేష్ ఏం చేస్తాడో చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పకుండానే.. పాదయాత్ర చేస్తున్నాడని పర్యాటక శాఖ మంత్రి రోజా Minister Roja విమర్శించారు.
చిత్తూరు నగరంలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలో.. రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారని ఆరోపించారు. ఆ దాచుకున్న సొమ్మును హైదరాబాద్ లో దాచుకోవడమే కాకుండా లోకేష్ తన తండ్రిని ముఖ్యమంత్రి పీఠం ఎక్కించాలని తహతహలాడుతున్నాడని విమర్శించారు.
ఒకవైపు చంద్రబాబు కాంగ్రెస్ తో కుమ్మక్కై జగన్ ను వేధించినా.. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగారని తెలిపారు.
పేద కష్టాల ప్రజలను విన్నా జగన్.. వాటిని నెరవేర్చేదిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు.
రాష్ట్ర ప్రజలకు జగన్ అండగా ఉన్నారని.. ఎన్ని పొత్తులతో వచ్చిన జగన్ ను ఏం చేయలేరని అన్నారు.
పేద ప్రజల సమస్యలను తీరుస్తున్నాం కాబట్టే.. మళ్లీ ఓట్లు అడుగుతున్నామని పేర్కొన్నారు.
నారా లోకేష్.. చంద్రబాబు నాయుడు అవసరానికి నందమూరి కుటుంబాన్ని వాడుకొని వదిలేస్తున్నారని ఆరోపించారు.
అధికారంలో ఉన్నపుడు గుర్తురాని కుటుంబం.. పార్టీ ఆపదలో ఉంటే గుర్తు వస్తున్నారా అని రోజా Minister Roja ప్రశ్నించారు.
మీ సెక్యూరిటీ, వాలంటీర్లు లేక పోతే పది మంది కూడా పాదయాత్రకు రారని ఎద్దేవా చేశారు. యువ గళం కాదు ఒంటరి గళం అని విమర్శలు గుప్పించారు.
లోకేష్ లీడర్ గా వంద శాతం ఫెయిల్యూర్ అయ్యారని.. ఇది మంగళగిరి ప్రజలు గుర్తించే ఓడించారని అన్నారు.
తండ్రి ముఖ్యమంత్రిగా , తను మంత్రిగా ఉన్నా కనీసం ఎమ్మెల్యే గా గెలవలేని రికార్డు లోకేష్ దని చెప్పారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/