Chalo Kondagattu : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు కొండగట్టు, ధర్మపురి ఆలయాలను సందర్శించనున్న విషయం అందరికీ తెలిసిందే.
ఈ మేరకు ఇప్పుడే తాజాగా భారీ జన సందోహం మధ్య పవన్ కళ్యాణ్ కొండగట్టుకి చేరుకున్నారు.
పవన్ కళ్యాణ్ వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారని ముందే తెలియడంతో ఆయనను చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు.
జనసేనానికి అడుగడుగునా నీరాజనాలు పలుకుతూ ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.
ప్రస్తుతం పవన్ కొండగట్టు పర్యటన మాత్రం ఇరు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారుతుంది.
ఉదయాన్నే 8 గంటల సమయంలో పవన్ హైదరాబాద్ నుంచి కొండగట్టు లోని ఆంజనేయ స్వామి ఆలయానికి బయల్దేరారు.
11 గంటల సమయానికి ఆలయానికి చేరుకోవాల్సిన పవన్.. అభిమానులు, ట్రాఫిక్ కారణంగా కొంచెం ఆలస్యంగా ఆలయానికి చేరుకున్నారు.
ఈ మేరకు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారగా.. #chaloKondagattu హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ గా మారింది.
భారీ జనసందోహం నడుమ కొండగట్టు అంజన్న సన్నిధికి చేరుకున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.#ChaloKondagattu #Varahi pic.twitter.com/lrmYbi5jqh
— 𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮 (@JSPTelangana) January 24, 2023
అంజన్న దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వారాహి ప్రచార రథంకి పూజలు నిర్వహిస్తారు.
అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు నాచుపల్లి శివారులోని బృందావన్ రిసార్ట్‌లో తెలంగాణలోని పార్టీ ముఖ్యనేతల సమావేశంలో పవన్ పాల్గొననున్నారు.
రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం చేపట్టబోయే కార్యక్రమాలపై పవన్ కళ్యాణ్ చర్చించి దిశానిర్దేశం చేస్తారు.
మరలా సాయంత్రం 3.30 నిమిషాలకు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జనసేనాని ప్రత్యేక పూజలు చేస్తారు.
నేడు ధర్మపురి నుండి అనుష్టుస్ నారసింగ యాత్ర గా 32 క్షేత్రాల సందర్శన యాత్ర ప్రారంభం కానుంది.
ధర్మపురి సందర్శన అనంతరం సాయంత్రం 5.30 నిమిషాలకు పవన్ కళ్యాణ్ తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
ఇటీవలే హైకోర్టు జీవో 1 ని సస్పెండ్ చేస్తూ తీర్పు ఇచ్చింది.
దీంతో వైకాపా సర్కారుకి ఊహించని షాక్ తగిలింది.
కాగా అందుకు బదులుగా జగన్ సర్కారు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. హైకోర్టులో దీని గురించి విచారణ ఉన్నందున ఈ కేసు విషయంలో జోక్యం చేసుకోలేము అని వెల్లడించడంతో వైకాపా నేతలు కంటి మీద కునుకు లేకుండా ఎం చేయాలో అని ఆలోచిస్తున్నారు.
అంతకు ముందు జీవో 1 నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
(Chalo Kondagattu) కొండగట్టులో మొదటి పూజకు కారణం అదే..
2009లో ఎన్నికల ప్రచారం కోసం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అత్యంత శక్తివంతమైన విద్యుత్ తీగలు తగిలి పవన్ కళ్యాణ్ ప్రమాదానికి గురి అయ్యారు.
కాగా కొండగట్టు ఆంజనేయస్వామి కటాక్షంతోనే ప్రమాదం నుంచి బయటపడినట్లు పవన్ కళ్యాణ్ ప్రగాఢంగా విశ్వసిస్తారు.
అందువల్ల ఆయన తలపెట్టే అతి ముఖ్యమైన కార్యక్రమాలు కొండగట్టు ఆలయం నుంచి ప్రారంభించడం శుభసూచకంగా భావిస్తారని తెలిపారు.
అందుకే రాజకీయ క్షేత్ర పర్యటనల కోసం రూపొందించిన ‘వారాహి’ వాహనాన్ని ఇక్కడ నుంచి ప్రారంభించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/