Ambati Rambabu : వైకాపా మంత్రి అంబటి రాంబాబుకు అదిరిపోయే రేంజ్ లో జనసైనికులు కౌంటర్లు ఇస్తున్నారు.
ఇటీవల సత్తెనపల్లిలో జరిగిన భోగి వేడుకల్లో మహిళలతో కలిసి అంబటి రాంబాబు డ్యాన్స్ వేసిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి.
తన డ్యాన్సులతో అంబటి రాంబాబు అందరికీ ఆకట్టుకున్నారు. అదిరిపోయే స్టెపులతో భోగి వేడుకల్లో ప్రజలను అలరించారు.
ఈ వీడియోపై తన ట్విట్టర్ అకౌంట్‌లో మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ‘సంబరాల రాంబాబు గారు మీరు డ్యాన్స్ మహత్తరంగా చేసారు.
పోలవరం పూర్తి చేసి డ్యాన్స్ చేసి ఉంటే ఇంకా మహత్తరంగా ఉండేది’ అని నాగబాబు సెటైర్లు పేల్చారు.
నాగబాబు ట్వీట్‌కు అంబటి రాంబాబు (Ambati Rambabu) కౌంటర్..
‘నువ్వు, మీ తమ్ముడు అన్నట్లు సంబరాల రాంబాబునే కానీ.. ముఖానికి రంగు వేయను.. ప్యాకేజీ కోసం డాన్స్ చేయను’ అంటూ నాగబాబు, పవన్ కల్యాణ్‌లకు ట్యాగ్ చేస్తూ వ్యంగ్యస్త్రాలు సంధించారు.
దీంతో నాగబాబు, మంత్రి అంబటి రాంబాబు మధ్య ట్విట్టర్‌లో వార్ ప్రారంభమైంది. కాగా ఈ తారుణంలోనే ట్విట్టర్ వేదికగా జనసేన, వైసీపీ కార్యకర్తలు కూడా పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు.
నువ్వు, మీతమ్ముడు అన్నట్టు
“సంబరాల రాంబాబు”నే !
కానీ…ముఖానికి రంగు వేయను
ప్యాకేజి కోసం డాన్స్ చేయను ! @NagaBabuOffl@PawanKalyan— Ambati Rambabu (@AmbatiRambabu) January 16, 2023
ఇటీవల శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన యువశక్తి బహిరంగ సభలో సంబురాల రాంబాబు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చురకలు అంటించారు.
దీంతో పవన్ వ్యాఖ్యలకు అంబటి రాంబాబు కూడా కౌంటర్ ఇచ్చారు.
దీంతో జనసైనికులు ట్విట్టర్‌లో అంబటి రాంబాబుపై ట్రోల్స్ చేస్తోన్నారు.
ఆయన డ్యాన్స్ వీడియోపై సెటైర్లు వేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.
ఈ మేరకు అంబటి రాంబాబు గతంలో నటించిన సినిమాల వీడియో లను ట్యాగ్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ఒక వేళ మీకు కనబడకపోతే కళ్ళజోడు తీసి చూడలంటూ సెటైర్లు వేశారు.
దీంతో ట్విట్టర్ వేదికగా అంబటి రాంబాబు మ్యాటర్ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ఇది ఎవర్రా నువ్వు కాదా ముసలి తాత pic.twitter.com/JXUr3Rj3LE
— 🦅GHANI BHAI بهاي🦁 (@BheemlaBoy1) January 16, 2023
మరోవైపు ఇటీవలే మంత్రి రోజా వర్సెస్ నాగబాబు మధ్య మాటల తూటాలు పేలాయి. రోజా నోరు చెత్తకుప్పతో సమానమని నాగబాబు వీడియో విడుదల చేయగా.. నాగబాబు మనిషి పెరిగాడు కానీ బుర్ర పెరగలేదంటూ రోజా విమర్శించారు. అమ్ముడుపోయే వ్యక్తులు తన గురించి మాట్లాడితే ఊరుకునేది లేదంటూ రోజా హెచ్చరించారు. మెగా ఫ్యామిలీ రాజకీయాల్లో ఫెయిల్యూర్ అని విమర్శించారు. డైమండ్ రాణి అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై రోజా మండిపడ్డారు. తాను రాణినే అని, పవన్ కేవలం సినిమాల్లో మాత్రమే గబ్బర్ సింగ్ అని ఎద్దేవా చేశారు. అందుకు గాను మంత్రి రోజాకి వారి వారి శైలిలో జనసైనికులు ఇచ్చిపడేశారు. దీంతో రోజా సైలెంట్ అయిపోయింది. జన సైనికుల దెబ్బకి ఇక అంబటి రాంబాబు కూడా ఉదయం నుంచి మరో ట్వీట్ చేయకుండా సైలెంట్ గా ఉండడం పట్ల వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా షాక్ అవుతున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/