Site icon Prime9

Jagadish Shettar: బీజేపీకి షాక్ ఇచ్చిన జగదీష్ షెట్టార్.. కాంగ్రెస్ లో చేరిన మాజీ సీఎం

jagadeesh shetter

jagadeesh shetter

Jagadish Shettar: ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. భాజాపాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే ఆ పార్టీకి పలువురు నేతలు గుడ్ బై చెప్పారు. తాజాగా భాజపాకు ఆ పార్టీ కీలక నేత.. మాజీ సీఎం జగదీష్ షెట్టారు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన నేడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

బీజేపీకి షాక్.. (Jagadish Shettar)

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. భాజాపాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే ఆ పార్టీకి పలువురు నేతలు గుడ్ బై చెప్పారు. తాజాగా భాజపాకు ఆ పార్టీ కీలక నేత.. మాజీ సీఎం జగదీష్ షెట్టారు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన నేడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

వచ్చే ఎన్నికల్లో టికెట్ కేటాయించలేదనే కారణంతో జగదీష్ షెట్టార్ పార్టీకి రాజీనామా చేశారు. ఒక్కరోజు వ్యవధిలోనే.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, సిద్ధరామయ్య, రణ్‌దీప్ సుర్జేవాలా సమక్షంలో పార్టీలో చేరారు.

అనంతరం జగదీష్ షెట్టార్ మీడియాతో మాట్లాడారు. భాజపా బలోపేతానికి ఎన్నో ఏళ్లు కృషి చేసిన తనకు.. టికెట్ ఇవ్వకుండా దారుణంగా అవమానించారని జగదీష్ శెట్టర్‌ పేర్కొన్నారు. తన రాజీనామా విషయంలో ఎవరూ బుజ్జగించే ప్రయత్నం కూడా చేయలేదని తెలిపారు. జగదీష్ షెట్టార్ లింగాయత్ కమ్యూనిటీకి చెందిన వారు. లింగాయత్ ల ప్రభావం ఈ ఎన్నికల్లో పడనుంది.

ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే.. కర్ణాటకలో కమలం కాకవికలం అవుతోంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.

ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్, జేడీఎస్‌లో చేరారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 10న ఒకే విడతలో జరగనుంది. 13న కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. ఇటీవల నిర్వహించిన సీఓటర్ సర్వేలో ఈసారి కాంగ్రెస్‌దే విజయమని తేలింది.

 

కొంత ప్రభావం చూపుతుంది..

శెట్టర్ రాజీనామా హుబ్బళ్లి-ధార్వాడ ప్రాంతంలో పార్టీపై కొంత ప్రభావం చూపుతుందని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత దానిని అధిగమించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే పట్టుదలతో శెట్టర్‌ను శాంతింపజేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని బొమ్మై అన్నారు.

షెట్టార్ కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చిన ప్రయోజనం లేదని సీఎం అన్నారు.

మా నిబంధనలను షెట్టార్ అంగీకరించలేదని..తనను పార్టీలో కొనసాగించేందుకు బీజేపీ సీనియర్ నేతలు ప్రయత్నాలు చేసిందని బొమ్మై అన్నారు.

ఈసారి తనను పోటీ చేయకూడదనే పార్టీ నిర్ణయం వెనుక ఎలాంటి కుట్ర లేదని విలేఖరుల ప్రశ్నకు సమాధానంగా కటీల్ చెప్పారు.

శెట్టర్, యడ్యూరప్ప మాదిరి ప్రముఖ లింగాయత్ నాయకులలో ఒకరు. ఆయన 2012 నుండి 2013 వరకు రాష్ట్ర 15వ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

మంత్రిగా వివిధ శాఖలను కూడా నిర్వహించారు. శెట్టర్ రాజీనామా రాజకీయంగా ప్రాముఖ్యం ఉన్న ప్రాంతమైన ఆయన స్వస్థలమైన హుబ్బలి-ధార్వాడ్‌లో ప్రభావం చూపే అవకాశం ఉంది.

 

Exit mobile version