Site icon Prime9

Janasena Yuvashakthi: వారాహిని ఆపితే పాదయాత్ర.. అప్పుడు మీ అందరికీ కాశీ యాత్రే – హైపర్ ఆది

hyper adi in janasena yuvashakthi

hyper adi in janasena yuvashakthi

Janasena Yuvashakthi: శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జనసేన యువశక్తి సభ నిర్వహిస్తుంది. ఇప్పటికే ఈ సభకు భారీస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో యువత కూడా చేరుకున్నారు. జిల్లాలోని లావేరు మండలం తాళ్లవలస పంచాయితీ పరిధిలో 35 ఎకరాల ప్రైవేటు స్ధలంలో పవన్ సభ నిర్వహిస్తున్నారు. వివేకానంద జయంతిని పురస్కరించుకొని సభావేదికకు వివేకానంద వికాస వేదికగా నామకరణం చేశారు. వివేకానంద జయంతిని పురస్కరించుకొని సభావేదికకు వివేకానంద వికాస వేదికగా నామకరణం చేసారు.

వైసీపీపై నిప్పులు చెరిగిన ఆది

కాగా ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు. పలువు యువత సభలో ప్రసంగించారు. కాగా తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. సభపై పవన్‌తో పాటు 100 మంది యువ ప్రతినిధులు వేదికపై కూర్చునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ పక్కన నాదెండ్ల మనోహర్, నాగబాబు కూర్చున్నారు. ఈ మేరకు ఫస్ట్ టైం.. ఉత్తరాంధ్ర కళాకారులతో కలసి స్టేజిపై పవన్ డ్యాన్స్ చేశారు. ఈ సభ(Janasena Yuvashakthi)లో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆది వైసీపీపై నిప్పులు చెరిగాడు.

తాను ఈ సభలో సినీ నటుడిగా తాను ఈ సభలో సినీ నటుడుగా పాల్గొనలేదని కేవలం జనసేన అభిమానిగానే సభలో పాల్గొన్నట్లు చెప్పాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకులకు తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు గుప్పించాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని ప్యాకేజ్ స్టార్ అని దత్తపుత్రుడని విమర్శలు చేసే నాయకులకు గట్టిగా రిప్లై ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ని ప్రేమతోనే సొంతం చేసుకోవాలని.. ఆయన డబ్బుకు లొంగే వ్యక్తి కాదని చెప్పాడు. అదేవిధంగా దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని కౌంటర్ వేస్తున్న వైసీపీ నాయకులు భవిష్యత్తులో ఆయన దత్తపుత్రుడు కాదు అంజనీపుత్రుడు అని తెలుసుకుంటారని చెప్పాడు. వారాహిని ఆపేస్తాం తిరగనివ్వం అంటూ కామెంట్ చేస్తున్న వైసీపీ నాయకులు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలని ఆయనకు తిక్క రేగితే పాదయాత్ర చేస్తారని అప్పుడు మీరంతా కాశీ యాత్ర చేయాల్సి వస్తుందని కౌంటర్ ఇచ్చారు.

 

ఇవీ చదవండి:

Janasena Yuvashakthi: జ్ఞాని ఎవరంటే.. భగవద్గీత శ్లోకం చదివి అందరి చేతా వావ్ అనిపించిన ముస్లిం యువతి

Varahi: వారాహిని అడ్డుకునేందుకే జీవో నెంబర్ 1

Nagababu : బాబాయ్ హత్య ఆయనకు తప్పుకాదు.. అడ్డం వచ్చినవారిని అడ్డుతొలగించడమే ఆయన పని : నాగబాబు

Veera Simha Reddy: బాలకృష్ణ వీర సింహారెడ్డిపై వైసీపీ నేత తీవ్ర వ్యాఖ్యలు… సినిమా దొబ్బింది అంటూ

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

 

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version