Site icon Prime9

liquor Brands: మందుబాబులకు గుడ్ న్యూస్.. ఏపీలో కొత్తగా మరో 10 మద్యం బ్రాండ్లు

liquor

liquor

liquor Brands: ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్ .ఇప్పుడున్న బ్రాండ్లతో కలిపి కొత్తగా మరో 10 మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. exఈ మేరకు ఏపీఎస్‌బీసీఎల్ అనుమతులు మంజూరు చేసింది. అంతేకాకుండా అదే కేటగిరీలోని మిగతా బ్రాండ్ల కంటే ఎక్కువ ధరకు అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చింది. తమిళనాడుకు చెందిన ఎస్ఎన్‌జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్ లిమిటెడ్ సంస్థతోపాటు మరికొన్ని మద్యం సరఫరా కంపెనీలకు సంబంధించిన ఈ కొత్త బ్రాండ్లకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.

ప్రస్తుతం కొన్ని కేటగిరీల బీరు ధర రూ. 200గా ఉంది. ఇప్పుడు కొత్తగా అనుమతి పొందిన బ్రాండ్ల బీరు ధర రూ. 220గా ఉంది. అలాగే కొన్ని కేటగిరీల్లో క్వార్టర్ మద్యం ధర రూ. 110గా ఉంటే ఇప్పుడు కొత్తగా అనుమతి పొందిన బ్రాండ్ల మద్యం క్వార్టర్ ధర రూ. 130గా ఉంది. కాగా కొత్తగా అనుమతులు పొందిన బ్రాండ్లు వాటికి నిర్ణయించిన ధరల విషయంలో ఏపీఎస్‌బీసీఎల్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక మద్యం అమ్మకాలలో విస్తృత మార్పులు చేసింది. ఏటా నిర్వహించే మద్యం షాపుల వేలాన్ని రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా షాపుల్లో సిబ్బందిని నియమించి మరీ అమ్మకాలు సాగిస్తోంది. మరోవైపు కొత్తబ్రాండ్లు తెచ్చి భారీగా మద్యం రేట్లను పెంచిందన్న ఆరోపణలను మూటగట్టుకుంది.అయితే మధ్యపానాన్ని నిషేధించేందుకే రేట్లను పెంచినట్లు ఏపీ సర్కార్ చెబుతోంది.

Exit mobile version