Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు కొండ గట్టు అంజన్న, ధర్మపురి లక్ష్మీనరసింహ క్షేత్రాల్లో పర్యటించిన విషయం తెలిసిందే.
జనసేన పార్టీ ఎన్నిక ప్రచార రథం వారాహి వాహనానికి అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.
ముందుగా ఆంజనేయస్వామిని దర్శించుకుని పవన్ ప్రత్యేక పూజలను చేశారు.
అనంతరం జనసేన ఎన్నికల ప్రచార రథం వారాహి పైకి ఎక్కి ప్రసంగించారు.
అయితే పవన్ ను చూసేందుకు చాలా మంది అభిమానులు వచ్చారు.
కాగా పవన్ వారాహి వెంట బైక్ లతో అభిమానులంతా ర్యాలీగా వెళ్లారు.
కాగా ఈ పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది.
పవన్ కాన్వాయ్ ను ఫాలో అవుతున్న సమయంలో ప్రమాదం జరగడంతో ఓ అభిమాని మృతి చెందడం అందరినీ కలిచి వేస్తుంది.
కిషన్ రావు పేట దగ్గర పవన్ కాన్వాయ్ లోని కారును అభిమాని బైక్ ఢీ కొట్టింది.
ఆ ఘటనలో ఒక అభిమాని మృతి చెందగా.. ముగ్గురికి గాయాలు అయ్యాయి.
గాయపడిన వారిని జగిత్యాలలోని హాస్పటల్ కు తరలించారు.
పవన్ కాన్వాయ్ ను వెంబడించే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.
తెలంగాణలో పోటీ గురించి నోరు విప్పిన(Pawan Kalyan)పవన్ కళ్యాణ్..
మరోవైపు తెలంగాణ రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్ తనదైన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నారు.
ఏపీ రాజకీయాలపైనే ప్రధానంగా ఫోకస్ చేస్తున్న పవన్ కళ్యాణ్.. తాజాగా తెలంగాణలోని పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.
7-14 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తామని పవన్ ప్రకటించారు. అదే సమయంలో పొత్తులకు సిద్ధమంటూ సంకేతాలిచ్చారు.
25 నుంచి 40 అసెంబ్లీ సీట్లలోనూ బరిలోకి దిగిందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది.
ప్రతి నియోజకవర్గం లోనూ ఒకటికి రెండుసార్లు పర్యటిస్తానని జనసేనాని చెప్పారు.
కొన్ని కారణాలతో జీహెచ్ఎంసీ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నామని.. కానీ ఈసారి ఆ పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు.
తన రాజకీయ ప్రస్థానంతో పాటే.. జనసేన పుట్టుక కూడా తెలంగాణ గడ్డపై నుంచే మొదలైందన్నారు.
పరిమితస్థాయిలోనే పోటీ చేస్తూ ఆట మొదలుపెడుతామన్నారు.
తెలంగాణ అసెంబ్లీలో 10 మంది జనసేన ఎమ్మెల్యేలు ఉండాలన్నది తన కోరికని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏపీలో రాజకీయాల్లో పొత్తులపై అత్యంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తన సిద్దాంతాలకు అనుగుణంగా ఉన్న పార్టీలో కలిసి ముందుకెళతానని తనతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటానంటూ వ్యాఖ్యానించారు.
పొత్తులు కుదరకపోతే జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుంది అంటూ జనసేనాని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నామన్న పవన్.. ‘వైసీపీ’వ్యతిరేక ఓట్లు చీలకూడదని అన్నారు.
ఎన్నికల దగ్గరపడ్డాక పొత్తుల గురించి ఆలోచిస్తామని..ప్రస్తుతం పొత్తుల గురించి ఆలోచించే సమయం కాదని అన్నారు.
అలాగే వారాహి అనే పేరుకు అర్థం చెప్పిన పవన్ ‘వారాహి’అంటే.. దుష్టులను శిక్షించేది అంటూ వివరించారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇరు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/