Pawan Kalyan In Unstoppable 2 : ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ టాక్ షో కి నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ మేరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల బాలయ్య షో లో పాల్గొన్నారు. పవన్ ఎపిసోడ్ ని రెండు పార్ట్ లుగా రిలీజ్ చేశారు.
ఇటీవలే రిలీజ్ అయిన ఫస్ట్ పార్ట్ రికార్డులన్నీటిని చెరిపేసి కొత్త రికార్డులను సృష్టించింది.
దీంతో అటు నందమూరి అభిమానులు.. ఇటు మెగా అభిమానులు రెండో ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూశారు.
ఈ తరుణంలోనే తాజాగా రిలీజ్ అయిన ఎపిసోడ్ కూడా ఓ రేంజ్ లో అందర్నీ అలరిస్తుంది అని చెప్పాలి.
ఈ సంధర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి పవన్ కళ్యాణ్ ఓపెన్ అయ్యారు.
(Pawan Kalyan In Unstoppable 2) అన్నయ్య తుపాకీతో కాల్చుకుందామనుకున్నా.. కానీ !
చిన్నప్పటి నుంచి ఆస్తమా, జ్వరం ఉండేవి. ఆరు, ఏడో తరగతుల్లో ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. సరైన స్నేహితుల్లేక ఇంటిపట్టునే ఉండాల్సి వచ్చేది. పుస్తకాలే స్నేహితులుగా గడిపాను. పాఠశాల, కళాశాలకు వెళ్లడం ఇబ్బందిగా అన్పించేది. పరీక్షల ఒత్తిడి నచ్చేది కాదు. ఆ క్రమంలో ఉపాధ్యాయులూ నచ్చేవాళ్లు కాదు. సెల్ఫ్ లెర్నింగ్‌లో నడిచాను. స్నేహితులంతా ఉన్నత చదువులు, క్రికెట్‌లో రాణిస్తున్న వేళ నేను పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయాను. ఆత్మన్యూనతాభావం ఉండేది.
17 ఏళ్ల వయసులో మానసికంగా కుంగిపోయా. చనిపోతే బాగుండు అన్పించింది. అన్నయ్య లైసెన్స్ రివాల్వర్ తీసుకుని కాల్చుకుందామనుకున్నా. సురేఖ వదిన, నాగబాబు అన్నయ్య గమనించి ఎందుకలా ఉన్నావని అడిగారు. కాల్చుకుందామనుకుంటున్నా అని చెప్పడంతో వారు చిరంజీవి అన్నయ్య దగ్గరకు తీసుకెళ్లారు. పరీక్షలపై దిగులుతో ఇలా ప్రవర్తిస్తున్నానని చెప్పారు. నువ్వేం చదవకపోయినా పర్లేదు, బతికి ఉండరా అని చెప్పారు. ఆ ఒక్క మాట ఎందుకో నన్ను బాగా కదిలించింది.. అందుకే తర్వాత మనసు మార్చుకున్నాను అని వెల్లడించారు.
ఈ విషయంపై బాలకృష్ణ స్పందిస్తూ.. తట్టుకోలేనంత బాధ వచ్చినప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు తీవ్ర నిర్ణయాలు తీసుకోవాలనిపిస్తుంది. అలాంటప్పుడు స్నేహితులు, తల్లిదండ్రులు, తోబుట్టువులతో మనసువిప్పి మాట్లాడండి. సిగ్గుపడొద్దు ఎవరేమనుకుంటారోనని భయపడకండి. దారినపోయే దానయ్య సలహా కూడా జీవితాన్ని మార్చేయొచ్చు. ఈ జన్మ ఒక వరం.. జీవించడం ఒక యోగం.. సాధనతో మీలో నుంచి ఒక పవర్‌స్టార్ పుట్టొచ్చు అని బాలకృష్ణ పేర్కొన్నారు.ప్రస్తుతం ఈ ఎపిసోడ్ రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతూ దూసుకుపోతుంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/