Chalo Kondagattu: పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎన్నికల ప్రచార వాహనం వారాహి ఏపీలో దూసుకుపోవడానికి సిద్ధమైంది.
దానికి గానూ ఈ నెల 24న వారాహికి తెలంగాణ రాష్రంలోని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో సంప్రదాయ పూజలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ తరుణంలో జనసేన పార్టీ తెలంగాణ కేంద్ర కార్యాలయం హైదరాబాద్ లో ఈ నెల 22న ఆ పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి ఛలో కొండగట్టు పోస్టర్స్ ను విడుదలచేశారు.
కాగా తాజాగా ఛలో కొండగట్టుకు సంబంధించిన ప్రోమోను జనసేన పార్టీ ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది.
ఈ వీడియోలో పవన్ గతంలో కొండగట్టు(Chalo Kondagattu)లో విద్యుత్ షాక్ తగిలినప్పుడు ఆ ఆంజనేయ స్వామే తన ప్రాణాలను కాపాడారాని చెప్పడం జరిగింది.
తాను ప్రజలకు సేవ చేయాలని అనుకుని మొదలుపెట్టే ఏ పని అయిన మొదట కొండగట్టు నుంచే ప్రారంభిస్తానని అనుకున్నానని.. అందుకే ఇప్పుడు కూడా వారాహికి ప్రథమంగా కొండగట్టులో పూజలు జరిపించిన తర్వాతే ప్రచారానికి వెళ్లనున్నట్టు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఛలో కొండగట్టు!!
రేపు (జనవరి 24న) జగిత్యాల జిల్లా, కొండగట్టు అంజన్న సన్నిధిలో జనసేన "వారాహి" వాహన పూజ జరిపించేందుకు కొండగట్టులో పర్యటించనున్న జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు @PawanKalyan pic.twitter.com/BtIEPEDX5F
— JanaSena Party (@JanaSenaParty) January 23, 2023
ఇకపోతే ఇటీవలే ప్రభుత్వం రోడ్ షోలను నిషేధిస్తూ జీవో నెంబర్ 1ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత ఆ జీవోపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.
కాగా, జీవో 1 ని సస్పెండ్ చేస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. దానితో వైకాపా ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది.
జగన్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను అడ్డుకోవడానికే ఈ జీవోను జారీ చేసిందని పవన్ సోదరుడు నాగబాబు సహా జనసేన నేతలంతా ఆరోపించారు.
ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ చేయబోయే బస్సు యాత్ర తెలుగు రాష్ట్రాల ప్రజల్లో, రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తిని పెంచుతోంది.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/