Site icon Prime9

Urvashi Rautela: “ప్రేయింగ్” అంటున్న ఊర్వశీ రౌటేలా.. రిషబ్ పంత్ కోసమేనా..?

bollywood-actress-urvashi-rautela-post-praying-amid-rishabh-pant-accident goes trending

bollywood-actress-urvashi-rautela-post-praying-amid-rishabh-pant-accident goes trending

Urvashi Rautela: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ శుక్రవారం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయిన విషయం తెలిసిందే. కాగా అతను డెహ్రాడూన్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ప్రస్తుతం పంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని బీసీసీఐ వెల్లడించింది. ప్రధాని మోదీసైతం పంత్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. పలువురు క్రికెటర్లు, ప్రముఖులు పంత్ త్వరగా కోలుకోవాలని ట్వీట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

కాగా ప్రస్తుతం పంత్ రోడ్డుప్రమాదంలో ఆసుపత్రిలో చేరి ఉండగా ప్రధాని మోదీ సైతం పంత్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. ఈ తరుణంలోనే తాజాగా నటి ఊర్వశీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్టు చేసింది. దేవకన్య రూపంలో ఉన్న ఆమె ఫొటోను షేర్ చేస్తూ.. దానికి కింద ప్రార్థిస్తున్నాను అని పేర్కొంది. పంత్ పేరు ఎక్కడా ప్రస్తావించకుండా కేవలం ప్రార్థిస్తున్నాను అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టును షేర్ చేసింది. దీనితో పంత్ కోసమే ఊర్వశీ పోస్ట్ అంటూ పలువురు నెటిజన్లు అంటున్నారు. కాగా ఈ పోస్ట్ పై పంత్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. భయ్యాజీ ఆసుపత్రిలో ఉంటే మీరు ఇలాంటి హాట్ చిత్రాలు పోస్టు తగదంటూ ఊర్వశిని పంత్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

actress-urvashi-rautela-post

ఇకపోతే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా, రిషబ్ పంత్ గతంలో ప్రేమలో ఉండి ఆ తర్వాత ఏమైందో ఏమోకానీ వారిద్దరూ విడిపోయారు. ఈ విషయంలో వారి మధ్య కొద్ది నెలల క్రితం సోషల్ మీడియాలో కోల్డ్ వార్ జరిగిన విషయం తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో క్రికెటర్ పంత్‌పై ఊర్వశి సంచలన ఆరోపణలు చేసింది. అయితే వాటిని పంత్ ఖండించారు. పంత్ ఫ్యాన్స్ సైతం ఊర్వశీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో కొంతకాలం నెట్టింట పంత్ వర్సెస్ ఊర్వశీ అన్నట్లుగా మాటల యుద్ధం జరిగింది.

bollywood-actress-urvashi-rautela-post

ఇదీ చదవండి: మీకు తెలుసా? రిషబ్ పంత్ మాదిరే ఐదుగురు క్రికెటర్లు రోడ్డు ప్రమాదాల్లో చిక్కుకున్నారు..

Exit mobile version