Veera Simhareddy Trailer : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకీ మరింత హీట్ ఎక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా మాటల యుద్దానికి దిగుతున్నాయి. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న అంగరంగ వైభవంగా నిర్వహించారు. మలినేని గోపీచంద్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఫ్యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో విలన్ గా దునియా విజయ్ నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒంగోలులో జరిగిన ఈ ఈవెంట్ కి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా… వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యపాత్ర పోషించింది.
ఇక ఈ మూవీ ఈవెంట్ లోనే సినిమా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ ని షేక్ చేస్తుంది.
ముఖ్యంగా బాలయ్య మాస్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి.
అయితే ఈ ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
తెదేపా తరుపున హిందూపురం ఎమ్మెల్యేగా కూడా బాలకృష్ణ పని చేస్తున్న విషయం తెలిసిందే.
సంతకాలు పెడితే ‘బోర్డ్ మీద పేరు మారుతుందోమో, కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు మార్చలేరు’ అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్ ఏపీ సర్కారుకు కౌంటర్ ఇచ్చినట్లు ఉంది.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు…
గతంలో ఏపీ సీఎం జగన్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ సమయంలో ఆ విషయం సినీ, రాజకీయంగా పెద్ద వివాదానికి కారణం అయ్యింది. ఇక ఇప్పుడు బాలకృష్ణ వేసిన డైలాగ్స్ తో మళ్ళీ ఆ విషయం మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. అలాగే ట్రైలర్ చివరిలో ‘పదవి చూసుకొని నీకు పొగరేమో, కానీ బై బర్త్ నా డిఎన్ఏ కే పొగరు ఎక్కువ’ అనే డైలాగ్ కూడా ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్ వేసినట్లు ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు డైలాగ్ లను ట్రెండ్ చేస్తూ నందమూరి అభిమానులు, తెదేపా కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. జనవరి 12వ తేదన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రానికి పోటీగా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య కూడా రానుంది. చిరు సినిమాని కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించడం గమనార్హం. వీరిద్దరి సినిమాలతో పాటు తమిళ డబ్బింగ్ సినిమాలైన వారసుడు, తెగింపు కూడా సంక్రాంతి బరిలో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి…
Veera Simhareddy : హెలీకాఫ్టర్‌లో బాలకృష్ణ.. ఒంగోలులో వీరసింహారెడ్డి ఎంట్రీ
CM Jagan : చిరంజీవి, బాలకృష్ణకు సినిమా చూపిస్తున్న జగన్ ప్రభుత్వం…
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/