Site icon Prime9

Meera Chopra : పవన్ కళ్యాణ్ మనసు బంగారం.. ఏపీ సీఎంగా చూడాలని ఉంది – మీరా చోప్రా

actress meera chopra shocking comments on pawan kalyan

actress meera chopra shocking comments on pawan kalyan

Meera Chopra : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది . ఆ సినిమాలో నటించిన “మీరా చోప్రా” ప్రేక్షకులకు సుపరిచితురాలే. తెలుగులో మీరా చోప్రా బంగారంతో పాటు.. వాన, మారో, గ్రీకు వీరుడు సినిమాలలో నటించింది. అయితే ఈ నాటికి మాత్రం తెలుగులో ఆశించిన మేర అవకాశాలు రాలేదు. దాంతో ప్రస్తుతం అడపాదడపా తమిళ్, హిందీ సినిమాలు చేస్తు కెరీర్ నెట్టుకొస్తోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటోంది. ఇక లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ పై ఈమె సోషల్ మీడియా వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది.

పవన్ కళ్యాణ్ ని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని ఉందంటూ తన కోరిక బయట పెట్టింది. ఈ క్రమం లోనే ఈమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం మహిళలకు రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ మహిళలకు రిజర్వేషన్ అనే అంశాన్ని 2019 ఎన్నికలప్పుడు ప్రస్తావించడం మాత్రమే కాదు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఓ నెటిజన్ పవన్ కళ్యాణ్ మహిళల రిజర్వేషన్ గురించి ప్రసంగిస్తున్న వీడియో షేర్ చేశాడు.

ఇక ఈ వీడియో కి మీరా చోప్రా (Meera Chopra) రిప్లై ఇస్తూ.. పవన్ కళ్యాణ్ మనసు నిజంగా బంగారం. ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని ఉంది అంటూ రాసుకొచ్చింది.  ఈ కామెంట్స్ పట్ల జనసేన కార్యకర్తలు , పవన్ కళ్యాణ్ అభిమానులు హ్యాప్పీ గా ఫీల్ అవుతూ.. కామెంట్స్ చేస్తున్నారు. అలానే ఇటీవల ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై.. మీరా చోప్రా ఫైర్ అయిన సంగతి తెలిసిందే.

 

’నారీ శక్తి వందన్ అధినియం’ అనే బిల్లు లోక్‌సభ మరియు రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను ప్రతిపాదిస్తుంది. 2026 తర్వాత మొదటి జనాభా గణన తర్వాత నిర్వహించబడే తదుపరి డీలిమిటేషన్ తర్వాత ఈ చట్టం అమలులోకి వస్తుంది.

 

Exit mobile version