Prime9

Mahaboobnagar Crime News: ఏం కష్టమొచ్చిందో పాపం ఆ తల్లికి.. ముగ్గురు పిల్లలతో సహా చెరువులో దూకి..!

Mahaboobnagar: తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఓ తల్లి తన ముగ్గురు పిల్లలతో సహా చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లితో సహా ఇద్దరు కవల పిల్లలు మరణించారు.

వివరాల్లోకి వెళ్తే, మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండలం కాకర్లపాడులో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లో భర్తతో గొడపడి ఇంటికి వచ్చిన రమాదేవి, సాయంత్రం వేళ తన ముగ్గురు పిల్లలను తీసుకుని కాకర్లపాడులోని నల్లకుంట చెరువు వద్దకు వెళ్లింది. అనంతరం నల్లకుంట చెరువులో ముగ్గురు పిల్లలతో సహా తల్లి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లి రమాదేవి, కవల పిల్లలు అయిన మేఘన, మారుతి మరణించగా, చెరువు నుంచి పెద్ద కుమార్తె నవ్య సురక్షితంగా బయటపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: రేణిగుంటలో ఘోర అగ్నిప్రమాదం.. వైద్యుడు సహా ఇద్దరు చిన్నారులు మృతి

Exit mobile version
Skip to toolbar