Rahul Gandhi: బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటయ్యాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కేసీఆర్ అవినీతికి పాల్పడితే మోదీ అండగా నిలబడ్డారని చెప్పారు. ఆదివారం ఆందోల్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ప్రసంగించారు.
హైదరాబాద్ ను అభివృద్ది చేసిందే కాంగ్రెస్ ..(Rahul Gandhi)
ఈ సందర్బంగా రాహుల్ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ అని, హైదరాబాద్ ను అభివృద్ది చేసిందే కాంగ్రెస్ అని అన్నారు.రాష్ట్రానికి కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేసారు. కాళేశ్వరం పేరుతో ప్రజల సొమ్ము దోచుకున్నారని అన్నారు. ధరణి పేరుతో పేదల భూములు లాక్కుంటున్నారని లక్షల ఎకరాలు భూములు అన్యాక్రాంతమయ్యాయని అన్నారు.తెలంగాణలో దొరల సర్కార్కు ప్రజలకు మధ్య పోరు జరుగుతోందని చెప్పారు.కేసీఆర్ ప్రభుత్వం పేపర్ లీకులు చేస్తోందన్నారు. తెలంగాణలో దొరల సర్కార్కు ప్రజలకు మధ్య పోరు జరుగుతోందన్నారు. మీరు చదువుకున్న స్కూళ్లు, కాలేజీలు కాంగ్రెస్ కట్టినవే అని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి అన్నారు.నాపై కేసు పెట్టారు.. ఇల్లు లాక్కున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడినా వారికి అండగాఉన్నారని ఆరోపించారు. రాష్ఠ్రంలో కాంగ్రస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని స్పష్టం చేసారు.