Prime9

Amit Shah : నేడు తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన..

Amit Shah : బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు తెలంగాణలో పర్యటించనున్నారు. కాగా నిన్ననే తెలంగాణలో ఎన్నికలకు నగారా మోగింది. ఈ క్రమంలో తెలంగాణలో చేపట్టాలని సన్నాహాలు చేస్తున్న బీజేపీ.. ఆ దిశగా తెలంగాణలో ఫోకస్ పెట్టింది. దీంట్లో భాగంగా బీజేపీ సీనియర్ నేతలు వరుస పర్యటనలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీంట్లో భాగంగా  కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే ఆయన పర్యటన షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. దీని కోసం తెలంగాణ నేతలు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కోసం అనుసరించాల్సిన వ్యూహం, స్ట్రాటజీ, సమన్వయం, తాజా రాజకీయ పరిణామాలు, పరిస్థితులపై షా చర్చించే అవకాశం ఉంది. షా పర్యటన వివరాలు..

ఇవాళ మధ్యాహ్నం 1.45 గంటలకు బేగంపేటకు చేరుకుంటారు అమిత్ షా.

అక్కడి నుంచి మధ్యాహ్నం 2.35 గంటలకు ఆదిలాబాద్‌కు పయనమవుతారు.

మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు బహిరంగ సభ ఉంటుంది.

ఆ సభలో అమిత్ షా పాల్గొంటారు. మళ్లీ సాయంత్రం 4.15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి.. 5.05 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.

ఆ తరువాత సాయంత్రం 6.20 గంటలకు మేధావులతో అమిత్ షా సమావేశం అవుతారు.

రాత్రి 7.40 గంటలకు ఐసీసీ కాకతీయలో బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం అవుతారు.

ఇక రాత్రి 9:40కి బేగంపేట నుంచి ఢిల్లీకి తిరుగుపయనమవుతారు అమిత్ షా..

 

YouTube video player

Exit mobile version
Skip to toolbar