WhatsApp: మన వాట్సాప్ ను మరొకరు చూస్తే మన గోప్యతకు భంగం కలుగుతుంది కదా డెస్క్ టాప్ లలో వాట్సాప్ లాగిన్ చేసి లాగ్ అవుట్ చెయ్యడం మర్చిపోతే దానిని ఎవరు ఓపెన్ చేసినా వాట్సాప్ ఓపెన్ అవుతుంది. దాని ద్వారా మన సమాచారం మొత్తం వారికి తెలిసే ప్రమాదం ఉంది. ఇలా జరుగకుండా ఉండేందు ఈ సమస్యకు త్వరలో పరిష్కారం లభించనుంది. త్వరలో డెస్క్ టాప్ (కంప్యూటర్లు)పై వాట్సాప్ యాప్ ఓపెన్ అవ్వాలంటే పాస్ వర్డ్ ఇవ్వడం తప్పనిసరి.
దానితో యూజర్లు వాట్సాప్ డెస్క్ టాప్ అప్లికేషన్ ను తెరిచిన ప్రతిసారీ పాస్ వర్డ్ ఇస్తేనే అది ఓపెన్ అవుతుంది. దీనివల్ల డెస్క్ టాప్ వాట్సాప్ వినియోగదారులకు అదనపు రక్షణ ఉంటుంది. ఒకరి వాట్సాప్ సంభాషణలను మరొకరు చూసే ప్రమాదం ఉండదు. ఈ ఫీచర్ పై ప్రస్తుతం వాట్సాప్ పనిచేస్తోంది. దీనివల్ల ఒకరి కంప్యూటర్ మరొకరు తెరిచినప్పుడు వాట్సాప్ ను చూడలేరు. ఇన్నాళ్లకు వాట్సాప్ లాక్ ఫీచర్ తీసుకొస్తోంది.
ఇదీ చదవండి: ట్విట్టర్ మాజీ ఉద్యోగులకు ‘కూ’ పిలుపు