Site icon Prime9

JIO Platform App: ఫేస్​బుక్​-ఇన్​స్టాగ్రామ్​ రీల్స్​కు పోటీగా.. జియో నుంచి కొత్త యాప్

jio-to-introduce-a-short-video-format-platform-app

jio-to-introduce-a-short-video-format-platform-app

JIO Platform App: జియో ఫేస్​బుక్​- ఇన్​స్టాగ్రామ్​ రీల్స్​కు పోటీగా సరికొత్త యాప్ తో వినియోదారులను ఆకర్షించేందుకు సన్నద్దమవుతుంది. “ప్లాట్​ఫామ్”​ పేరుతో కొత్త యాప్​ను తీసుకొచ్చేందుకు జియో ప్రణాళికలు చేస్తుంది.

జియో ప్లాట్​ఫామ్స్​ లిమిటెడ్​, క్రియేటివ్​ల్యాండ్​ ఏషియా, రోలింగ్​ స్టోన్స్​ ఇండియా సంస్థలు సంయుక్తంగా ఈ షార్ట్​ వీడియో యాప్​ను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ మేరకు ఓ ప్రెస్​ నోట్​ను కూడా విడుదల చేశాయి. ఎంటర్​టైనర్స్​ను గుర్తించి, మంచి వాతావరణంలో ఆర్గానిక్​గా వృద్ధిచెందుతూ, నిలకడగా మోనెటైజేషన్​ సాధించే లక్ష్యంతోనే ఈ యాప్​ను తీసుకొస్తున్నట్టు ఆ ప్రకటనలో సంస్థలు వెల్లడించాయి. క్రియేటర్లు, సింగర్లు, యాక్టర్లు, మ్యుజీషియన్లు, డ్యాన్సర్లు, కమేడియన్లు, ఫ్యాషన్​ డిజైనర్లతో పాటు ఇన్​ఫ్లుయెంజర్లుగా మారాలనుకునే వారందరికి ఈ ప్లాట్​ఫామ్​ యాప్​ ఓ మంచి వేదిక కానుందని జియో భావిస్తోంది.

ఈ యాప్​ను బీటా వర్షెన్​లో ఇప్పటికే టెస్ట్​ చేస్తున్నట్టు నివేదికల సమాచారం. అన్ని అనుకున్నట్టు జరిగితే 2023 జనవరిలో జియో రీల్స్ ప్లాట్ ఫామ్ యాప్​ లాంచ్​ అయ్యే అవకాశం ఉంది. కంటెంట్​ క్రియేటర్ల గ్రోత్​ను వాటి టాలెంట్ మరియు వ్యూవ్స్ ఆధారంగా నిర్ణయించనున్నట్టు తెలుస్తోంది. సిల్వర్​, బ్లూ, రెడ్​ టిక్​ వెరిఫికేషన్ల ద్వారా వారిని గుర్తిస్తారని సమాచారం. కంటెంట్​, ఫ్యాన్​బేస్​ ఆధారంగా ఈ టిక్స్​ను కేటాయిస్తారని తెలుస్తోంది. టెలికాం దిగ్గజమైన జియో మెటాకు పోటీగా నిలుస్తుండటం ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది. మరి జియో ప్రవేశపెట్టే ఈ రీల్స్​ యాప్​ను ఏ మేరకు వినియోగదారులు ఆదరిస్తారో వేచి చూడాలి.

ఇదీ చదవండి:  స్మార్ట్ ఫోన్ తయారీకి మస్క్ మొగ్గు.. యాపిల్‌, గూగుల్‌కు వార్నింగ్‌

Exit mobile version