SRH: సన్ రైజర్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. కోల్ కతా తో జరిగిన మ్యాచ్ లో 23 పరుగుల తేడాతో సన్ రైజర్స్ గెలిచింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పరుగుల వరద పారింది. ఇరుజట్లు 200 పైగా స్కోర్లు చేశాయి.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పరుగుల వరద పారింది. రెండు జట్లు.. 200పైగా స్కోర్లు చేశాయి. మెుత్తంగా 433 పరుగులు వచ్చాయి. ఇందులో 22 సిక్సర్లు, 39 ఫోర్లు ఉండగా.. ఓ సెంచరీ.. మూడు అర్ధశతకాలు నమోదయ్యాయి. మెుదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్.. 20 ఓవర్లలో 4 వికెట్లకు 228 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హ్యారీ బ్రూక్ సెంచరీతో చెలరేగాడు. 55 బంతుల్లో 100 పరుగులు చేశాడు. మార్‌క్రమ్ 50 పరుగులు.. అభిషేక్ శర్మ 32పరుగులతో రాణించారు. కోల్‌కతా బౌలర్లలో రసెల్ (3/22) ఒక్కడే ఆకట్టుకున్నాడు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా ఆరంభంలో తడబడింది. ఆరంభం చూస్తే.. ఆరంభం చూస్తే 200 దాటడం అనూహ్యమే. గుర్బాజ్ (0)ను తొలి ఓవర్లోనే భువనేశ్వర్ ఔట్ చేయగా.. వెంకటేష్ అయ్యర్ (10), సునీల్ నరైన్ (0)లను జాన్సన్ వరుస బంతుల్లో ఒకే రకంగా పెవిలియన్ చేర్చడంతో 4 ఓవర్లకు నైట్‌రైడర్స్ 22/3తో నిలిచింది. ఈ దశలో ఆ జట్టుకు ఘోర పరాభవం తప్పదనిపించింది. కానీ నితీష్ రాణా చెలరేగిపోయి ఆడాడు. ఉమ్రాన్ వేసిన ఓవర్లో.. ఏకంగా 28 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత మార్కండే.. జగదీశన్, రసెల్ ను ఔట్ చేశాడు. అయినా రాణా, రింకు ధాటిగా ఆడటం ప్రారంభించారు. దీంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. కానీ నటరాజన్ బౌలింగ్‌లో రాణా ఔటవ్వడంతో.. విజయం ఖరారైంది. సన్‌రైజర్స్ ఫీల్డర్లు ఏకంగా నాలుగు క్యాచ్‌లు జారవిడిచారు.
సన్‌రైజర్స్ బౌలర్లలో మయాంక్ మార్కండే (2/27), మార్కో జాన్సన్ (2/37), భువనేశ్వర్ (1/29) ఆకట్టుకున్నారు. సన్‌రైజర్స్‌కిది రెండో విజయం కాగా.. కోల్‌కతాకు రెండో ఓటమి.
చెత్త ఫీల్డింగ్..
కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ జట్టులో చాలా లోపాలు కనిపించాయి. ఫీల్డింగ్ మాత్రం దారుణంగా ఉందని చెప్పొచ్చు.
ఈ మ్యాచులో అలవోక క్యాచ్‌లను వదిలేయడంతో పాటు రనౌట్ చాన్స్‌లు కూడా మిస్ చేశారు.
కేకేఆర్ ముందు 229 పరుగులు కష్టసాధ్యమైన లక్ష్యం ఉంది కాబట్టే ఎస్‌ఆర్‌హెచ్ గెలిచింది అనుకోవచ్చు.
అటు ఇటుగా టార్గెట్ 200 ఉండుంటే మాత్రం ఎస్‌ఆర్‌హెచ్ కచ్చితంగా ఓడిపోయి ఉండేది. ఇక హ్యారీ బ్రూక్ సీజన్‌లో తొలి సెంచరీ నమోదు చేయడం.