Slap Kabaddi: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కబడ్డీ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిజం చెప్పాలంటే కబడ్డీ మన రాష్ట్ర క్రీడ. ఇప్పుడిది ప్రపంచంలో ఉన్న వివిధ గేమ్స్ లో ఇది కూడా ఓ మంచి గేమ్ గా గుర్తింపు పొందింది. ఇక ఈ క్రీడను కూడా ఒలెంపిక్స్ పెట్టమంటూ పలువురు క్రీడానిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే కబడ్డీ మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో సైతం ఈ ఆటను ఆడుతారు. అయితే ఒక్కో దేశంలో ఒక్కోవిధంగా ఆడుతుంటారు. అన్ని దేశాల్లో ఎలా ఆడినాసరే మన పొరుగుదేశమైన దాయాదీ దేశం పాకిస్థాన్‌లో మాత్రం చాలా వైరటీగా ఆడుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది మరి ఇంతకీ అంత వెరైటీగా కబడ్డీని ఎలా ఆడుతున్నారో తెలుసుకుందాం.
సాధారణంగా కబడ్డీ ఆటలో ఏడుగురు ఆటగాళ్లు ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడి కబడ్డీ ఆటకు మాత్రం అంత మంది అవసరం లేదట.. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా.. ఇక్కడ మాత్రం ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రమే కబడ్డీ ఆట జరుగుతుంది. దీనిని తప్పడ్ లేదా స్లాప్ కబడ్డీ అని అంటారు. ఇందులో కూడా కబడ్డీలోలానే సాధారణంగా కూతతోనే ఆట ప్రారంభమవుతుంది. ఆ తరువాత ఒకరినొకరు చెంప దెబ్బలు కొడుతుంటారు. ఈ చెంపదెబ్బలనే పాయింట్లుగా ఇస్తారంట.
చెంపలు పగలగొడితేనే గెలిచినట్టు(Slap Kabaddi)
ఇలా ఎదుటివారు ఓడిపోయేంత వరకు చెంపదెబ్బలు కొడుతూనే ఉంటారు. పంచ్‌లు ఇస్తే మాత్రం ఫౌల్‌గా పరిగణిస్తారు. ఈ ఆట చూడడానికి చాలా ఫన్నీగా ఉంటుంది కానీ ఆడే వారికి మాత్రం చెంపలు బూరెల్లా ఉబ్బిపోతాయండోయ్. ఇక్కడ ఇంకో విశేషమేంటంటే ఈ మ్యాచ్ ను చూడడానికి వచ్చిన ప్రేక్షకుల నుంచే డబ్బును కలెక్ట్ చేసి ఈ గేమ్ లో విన్ అయిన విజేతకు ఇస్తారంట.
పాక్‌కు చెందిన స్లాప్ కబడ్డీ ప్లేయర్ ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. స్లాప్ కబడ్డీకి పాక్‌లో ఎంతో ఆదరణ ఉంటుందని, ఇద్దరు వ్యక్తుల మధ్యే ఆట జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఒక ఆటగాడు కొట్టడం ద్వారా పాయింట్‌ను సాధిస్తాడని, మరో ఆటగాడు ప్రత్యర్థికి పాయింట్ ఇవ్వకుండా కాపాడుకుంటాడని తెలిపాడు. ఈ ఆటలో ఆటగాడు ప్రత్యర్థి ఆటగాడిని ఎన్ని సార్లైనా కొట్టవచ్చునని.. ఆటగాళ్లు గాయపడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారని తెలిపారు.
What fighting style is this 😧 pic.twitter.com/D5mNAXEVwK
— Woman of Wonder 🐳 (@WonderW97800751) June 29, 2023