Site icon Prime9

కేన్ విలియమ్సన్: 2022లో రూ.16కోట్లకు, 2023 రూ.2 కోట్లకే.. ఐపీఎల్ వేలంలో కేన్ విలియమ్సన్..!

kane williamson ipl career and he sold 2 crore rupees in 2023 ipl auction

kane williamson ipl career and he sold 2 crore rupees in 2023 ipl auction

Kane Williamson: దేశీ క్రికెట్ ఐపీఎల్‌ 2023 మినీ వేలం ముగిసింది. ప్రతి ఏడాది ఐపీఎల్ నిర్వహణను బీసీసీఐ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఐపీఎల్ జరుగుతుందంటే చాలు దేశీయ మరియు ఇంటర్నేషనల్ ప్లేయర్లు అంతా కలిసి ఓ జట్టుగా ఆడుతుంటే క్రికెట్ అభిమానులు తెగ పండుగ చేసుకుంటుంటారు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ కు సంబంధించిన మినీవేలం శుక్రవారం నాడు జరిగింది. ఈ వేలంలో కొందరు ఇంగ్లండ్ ఆటగాళ్లు అత్యధిక ధరకు అమ్ముడుపోగా మరికొందరు స్టార్ ఆటగాళ్లను అతి తక్కువ ధరకు ఫ్రాంచేజీలు సొంతం చేసుకున్నాయి. ఇలా తక్కువ ధర పలికిన ప్లేయర్స్ లో కేన్ విలియమ్సన్ ఒకరుగా చెప్పువచ్చు.

కేన్ మామ గుజరాత్ జట్టు కైవసం

2023 ఏడాదికి గానూ ఐపీఎల్ ఫ్రాంచేజీలు కొంత మంది స్టార్ ఆటగాళ్లను వేలానికి రిలీజ్ చేశాయి. వారిలో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు నుంచి కేన్ విలియమ్సన్ కూడా ఉన్నారు. ఈ ఏడాది కేన్ విలియమ్సన్ ను గుజరాత్ టైటాన్స్ రూ. 2 కోట్లకే సొంతం చేసుకుంది. 2022 విజేత జట్టు అయిన గుజరాత్ టైటాన్స్ మాత్రమే న్యూజిలాండ్ ఆటగాడైన కేన్ విలియమ్సన్ కోసం వేలం పాడిన ఏకైక జట్టు.

2022 ఏడాదిలో జరిగిన ఐపీఎల్ లో విలియమ్సన్‌ను 16 కోట్ల రూపాయలతో సన్ రైజర్స్ ఫ్రాంచైజీ తన వద్ద ఉంచుంది. కాగా గతేడాది అతను అంతగా రాణించ లేకపోవడంతో ఈ సీజన్‌లో హైదరాబాద్ విలియమ్సన్‌ను విడుదలచేసింది. అద్భుతంగా ఆడే ఆటగాడు ఒక్కసారి ప్రతిభ కనపరచకపోడంతో ఇలా విడుదలయ్యడం అతను ఇంత తక్కువ మొత్తానికి వేరే జట్టు సొంతం చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఎన్ని మ్యాచ్ లు ఆడాడంటే..

కాగా అతను హైదరాబాద్ జట్టు కోసం 76 మ్యాచ్‌లు ఆడాడు మరియు 2016 సన్ రైజర్స్ జట్టు టైటిల్ విజేతగా నిలవడంలో విలియమ్సన్ కీలక పాత్ర పోషించాడు. 2018లో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో విలియమ్సన్ జట్టు సారథిగా మారాడు. విలియమ్సన్ సారథ్యంలో ఆ ఏడాది జట్టు ఫైనల్స్ కు చేరుకుని తుదిపోరులో రన్నరప్ గా నిలిచింది. ఇలా అతను అతను ఐపీఎల్ టోర్నమెంట్‌లో 76 మ్యాచ్‌లు ఆడాడు. 36 కంటే ఎక్కువ సగటుతో మరియు 126.03 స్ట్రైక్ రేట్‌తో 2101 పరుగులు చేశాడు.

Kane Williamson

ఐపీఎల్ వేలంలో సన్ రైజర్స్ దూకుడు

ఇకపోతే మెగా వేలంలో ఆచితూచి వ్యవహరించే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ వచ్చే ఏడాదిగానూ నిర్వహిస్తున్న ఈ మినీ వేలంలో దూకుడు ప్రదర్శించింది. ఇంగ్లండ్ యువకిశోరం హ్యారీ బ్రూక్ ను రూ.13.25 కోట్లకు సన్ రైజర్స్ కొనుగోలు చేసింది. అంతేకాకుండా మంచి ఊపుమీదున్న భారత ప్లేయర్ మయాంక్ అగర్వాల్ ను రూ.8.25 కోట్లకు కొనుగోలు చేసింది.

ఇదిలా ఉంటే 2021లో టీ20 ప్రపంచ కప్ విన్నర్ గా నిలిచిన ఈ న్యూజిల్యాండ్ జట్టు. ఈ జట్టులోని కీలక ఆటగాడు అయిన విలియమ్సన్ ప్రస్తుతం టీ20 కెప్టెన్‌గా ఉన్నాడు కాగా ఈ నెల ప్రారంభంలో తాను న్యూజిలాండ్ టెస్ట్ కెప్టెన్సీ బాధ్యత నుంచి తొలిగిపోతానని ప్రకటించాడు.

ఇదీ చదవండి: ఆద్యంతం ఆసక్తిగా ఐపీఎల్ 2023… రికార్డు సృష్టించిన సామ్ కరన్

Exit mobile version