Site icon Prime9

IPL 2023 Rinku Singh And Dhawan: రింకూ రికార్డ్.. సింగిల్ హ్యాండ్ శిఖర్.. ఒకరిది గెలుపు మరొకరిది ఓటమి.. ఇది కదా టీ20 మ‌జా

IPL 2023 Rinku Singh And Dhawan

IPL 2023 Rinku Singh And Dhawan

IPL 2023 Rinku Singh And Dhawan: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ అంటే ఆ మజానే వేరేలెవల్.. చివరి బంతి వరకూ కూడా ఎవరు విన్ అవుతారనేది చెప్పడం కష్టం. ఇక అచ్చం ఇలాగే నిన్న ఏప్రిల్ 9 ఆదివారం నాడు జరిగిన రెండు మ్యాచ్ లను చూస్తే అర్ధం అవుతుంది. చివరి వరకు పోరాటి ఓడిన వారు ఒకరైతే.. ఒక్కడే పోరాడి ఓడిన వారు మరొకరు ఉన్నారు.

ఐపీఎల్ 2023 సీజన్ 16 భాగంగా అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో గుజ‌రాత్ టైటాన్స్, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ అస‌లు సిస‌లైన టీ20 మ‌జా ఏంటో అభిమానుల‌కు చూపించింది. ఈ మ్యాచ్‌లో కోల్‌క‌తా న‌మ్మ‌శ‌క్యం కాని విజ‌యాన్ని నమోదు చేసింది. 205 ప‌రుగుల ల‌క్ష్య ఛేదనలో భాగంగా బరిలోకి కోల్‌క‌తా స‌రిగ్గా 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. ఇక ఈ టీంపని అయిపోయిందిరా బాబూ.. అని తలలు పట్టుకుని నిరాశలో కూరుకుపోయిన కేకేఆర్ ఫ్యాన్స్ కు ఒక్కసారిగా రింకూ ఉత్సాహం తెప్పించాడు. గెలుపు దాదాపుగా కష్టం అనుకున్న సమయంలో రింకు సింగ్ అద్భుత‌మే చేశాడు.

కోల్‌కతా దిశ తిప్పేసిన రింకూ(IPL 2023 Rinku Singh And Dhawan)..

రింకు సింగ్‌.. ఇప్పటిదాకా పెద్దగా క్రికెట్ అభిమానులకు తెలియని పేరు. కానీ ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచ్ తో ఈ పేరు తెలియని వారుండరు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అంతలా తన మార్క్ చూపించి క్రికెట్‌ ఫ్యాన్స్ లో చెరగని ముద్ర వేసుకున్నాడు ఈ ఉత్తర్‌ప్రదేశ్‌ కుర్రాడు. ఐపీఎల్‌ సీజన్ 16లో కోల్‌కతా టీంకు ఆడుతున్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్. గుజరాత్‌ టీంతో తలపడుతున్న మ్యాచ్‌లో అద్భుతం చేశాడు. ఆఖ‌రి ఓవ‌ర్‌లో విజ‌యానికి 29 ప‌రుగులు అవ‌స‌రం కాగా తాను ఎదుర్కొన్న చివరి ఓవర్ 7 బంతుల్లో వరుసగా ఒక ఫోర్, ఐదు సిక్స్ లు (6, 4, 6, 6, 6, 6, 6) బాదేసి కోల్‌కతాకు అనూహ్య విజయాన్నందించాడు. గుజరాత్ కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ హ్యాట్రిక్‌ వికెట్లు నమోదు చేయడంతో అలవోకగా గెలిచేలా కనిపించిన గుజరాత్‌ జట్టు రింకు విధ్వంసంతో ఒక్కసారిగా కంగుతినింది.

రింకు సింగ్ కేవ‌లం 21 బంతుల్లో 48 ప‌రుగులతో గుజరాత్‌కు ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో తొలి ఓట‌మిని రుచిచూపించాడు. ఇక రింకూతో పాటు వెంక‌టేశ్ అయ్య‌ర్ 83 పరుగులు, కెప్టెన్ నితీశ్ రాణా 45రన్స్ తో రాణించారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో కెప్టెన్ ర‌షీద్ ఖాన్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, జోసెఫ్ రెండు, మ‌హ్మ‌ద్ ష‌మీ, జోష్ లిటిల్‌లు చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇలా చివరి బంతి వరకూ పోరాడిన గుజరాత్ ఆఖరికి వీరోచితమైన ఓటమిని చవిచూసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 204 ప‌రుగులు చేసింది.

సింగిల్ హ్యాండ్ శిఖర్ ఇక్కడ..

ఇకపోతే పంజాబ్ తరఫున ఒపెనర్‌గా దిగిన కెప్టెన్ శిఖర్ ధావన్ అజేయమైన 99 పరుగులతో వన్ మ్యాచ్ షో చేసినా సరే ఓటమిపాలవ్వక తప్పలేదు. వచ్చినవారు వచ్చినట్టే ఔట్ అవుతున్న సమయంలో క్రీజులో స్టాండర్డ్ గా నిలబడి పంజాబ్ జట్టుకు 143 పరుగుల ఓ మోస్తారు స్కోర్ అందిచారు శిఖర్. ధావన్(99 నాటౌట్) సామ్ కర్రన్(22) మినహా మిగిలినవారెవ్వరూ రెండంకెల స్కోర్ కూడా చెయ్యలేకపోయిన తరుణంలో టీమ్ కెప్టెన్‌గా ధావన్ ఒంటరి పోరాటం చేసి ఓటమిని చవిచూశాడనే చెప్పవచ్చు.

ఇక దానితో ఎట్టకేలకు ఐపీఎల్ 16వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి విజయం సాధించింది. పంజాబ్ తమ ముందుంచిన 144 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాదీలు సునాయాసంగా చేధించారు. ఈ క్రమంలో హైదరాబాద్ తరఫున రాహుల్ త్రిపాఠి 74(నాటౌట్), కెప్టెన్ ఐడాన్ మార్క్రమ్ 37 పరుగులతో అజేయంగా రాణించారు.

Exit mobile version