Site icon Prime9

ICC: ఐసీసీ ఛైర్మ‌న్‌గా “గ్రెగ్” ఏకగ్రీవం

icc-new chairman-greg-barclay unanumously elected

icc-new chairman-greg-barclay unanumously elected

ICC: న్యూజిలాండ్‌ క్రికెట్ బోర్డు మాజీ అధ్య‌క్షుడు, న్యాయ‌వాది, గ్రెగ్ బార్‌క్లే నూత‌న ఐసీసీ ఛైర్మ‌న్‌గా ఎన్నికయ్యారు. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్‌ బోర్డు గ్రెగ్‌ని అధ్య‌క్షుడిగా ఏక‌గ్రీవంగా ఎంపిక చేశారు. ఈయ‌న ఐసీసీ ఛైర్మ‌న్‌ ప‌ద‌వికి ఎన్నిక‌వ్వ‌డం వరుసగా ఇది రెండోసారి.

గ్రెగ్ మరో రెండేళ్ల పాటు ఈ ప‌ద‌విలో కొనసాగనున్నారు. ఆక్లాండ్‌లో న్యాయ‌వాదిగా ప‌నిచేస్తున్న గ్రెగ్ 2020 న‌వంబ‌ర్‌లో మొద‌టిసారిగా ఐసీసీ ఛైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. కాగా ‘రెండోసారి ఐసీసీ ఛైర్మ‌న్‌గా ఎన్నిక‌కావ‌డం చాలా సంతోషంగా ఉంది. నాకు మ‌ద్ద‌తుగా నిలిచిన ఐసీసీ డైరెక్ట‌ర్ల‌కు కృత‌జ్ఞ‌త‌లు’ అని గ్రెగ్ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఐసీసీ ఛైర్మ‌న్ ప‌ద‌వి కోసం గ్రెగ్ బార్‌క్లే, జింబాబ్వే క్రికెట్ ఛైర్మ‌న్ అయిన‌ త‌వెంగ్వా ముకుహ్‌లానీ పోటీ చేశారు. అయితే, త‌వెంగ్యా పోటీ నుంచి త‌ప్పుకోవ‌డంతో ఐసీసీ బోర్డు ఏక‌గ్రీవంగా గ్రెగ్‌ని కొత్త‌ ఛైర్మ‌న్‌గా ఎన్నుకుంది.
అంతేకాదు, ఈయ‌న 2015లో జ‌రిగిన‌ ఐసీసీ మెన్స్ వ‌ర‌ల్డ్‌క‌ప్‌కి డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు.

ఇదీ చదవండి: టీమిండియా ఓటిమిపై “గిన్నిస్ వరల్డ్ రికార్డ్” సెటైర్స్

Exit mobile version